Begin typing your search above and press return to search.

పోలీస్ ఆఫీస‌ర్ ను బూతులు తిట్టిన ఏపీ మంత్రి

By:  Tupaki Desk   |   20 Oct 2016 7:51 AM GMT
పోలీస్ ఆఫీస‌ర్ ను బూతులు తిట్టిన ఏపీ మంత్రి
X
ఏపీ మంత్రి - బీజేపీ నేత మాణిక్యాల‌రావు వివాదంలో చిక్కుకున్నారు. ఒక సీఐని ఉన్న‌తాధికారుల ముందు న‌డిరోడ్డుపై బూతులు తిట్ట‌డ‌మే కాకుండా తెల్లారేస‌రికి ఆయ‌న్ను స‌స్పెండు చేయాలంటూ డీఎస్పీకి ఆదేశాలు జారీచేశారు. ఇంత‌కీ మంత్రి అంత‌గా ఫైర‌వ‌డానికి కార‌ణ‌మేంటా అనిచూస్తే అది కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య రేగిన చిల్ల‌ర‌వివాదం. ఫ్లెక్సీల ఏర్పాటు విష‌యంలో వైసీపీ - బీజేపీ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య జ‌రిగిన‌ వివాదంలో మాణిక్యాల‌రావు జోక్యం చేసుకోవ‌డ‌మే కాకుండా పోలీసు అధికారుల‌ను దారుణంగా దూషించ‌డం వివాదాస్ప‌ద‌మైంది.

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వైసీపీ - బీజేపీ కార్యకర్తల మధ్య ఫ్లెక్సీ ల విష‌యంలో వివాదం చినికిచినికి గాలివాన‌గా మారింది. మంత్రి మాణిక్యాల‌రావు ఫొటోల‌తో ఉన్న ఫ్లెక్సీల‌కు ఎదురుగా వైసీపీ నేత‌ - మాజీ ఎమ్మెల్యే కొట్టు స‌త్యానారాయ‌ణ ఫ్లెక్సీని ఆయ‌న అభిమానులు ఏర్పాటు చేశారు. కొట్టు స‌త్యనారాయ‌ణ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్లీల‌ను తొల‌గించాల‌నిమంత్రి అనుచ‌రులు వైసీపీ నేత‌ల‌తో గొడ‌వ‌కు దిగారు. త‌మ మంత్రి ఫ్లెక్సీ ఎదుట వైసీపీ నేతల ప్లెక్సీలు ఎలా పెడుతారంటూ బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవ‌డంతో గొడ‌వ జ‌రిగింది. కొట్టు స‌త్య‌నారాయ‌ణ ఫ్లెక్సీల‌ను బీజేపీ కార్య‌క‌ర్త‌లు తొల‌గించడంతో ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి.

వైసీపీ కార్యకర్తల సమాచారంతో తొలుత కొట్టు సత్యనారాయణ కూడా అక్కడికి వచ్చారు. పోలీసులతో మాట్లాడి పుట్టిన రోజు సందర్భంగా పెట్టిన ఫ్లెక్సీని మూడు రోజుల్లో తీసివేయిస్తానని చెప్పారు. అయితే మంత్రి ప్రధాన అనుచరుడు ఒకరు పోలీసులు వారిస్తున్నా వినకుండా వెళ్లి వైసీపీ నేత కొట్టుసత్యనారాయణ ఫ్లెక్సీని బీజేపీ కార్యకర్తలతో కలిసి తొల‌గించారు. దీంతో ఇరు వర్గాలు పోటాపోటీగా మోహరించాయి. పరిస్థితి అదుపులో ఉండగానే మంత్రి మాణిక్యాలరావు అర్థరాత్రి అక్కడికి వచ్చారు. ఫ్లెక్సీల విషయంలో మంత్రి కూడా పట్టింపుకుపోయారు. డీఎస్పీ ముందే స్థానిక సీఐను బూతులు తిట్టారు. నేను ఫోన్‌ చేసినా మాట్లాడవా అంటూ అస‌భ్య ప‌ద‌జాలం కూడా వాడారు. తెల్లవారేసరికి ఇతడిని సస్పెండ్ చేసేయండి అంటూ డీఎస్పీని ఆదేశించారు. అంతేకాదు... దీనిపై సీఎంకు కంప్ల‌యింటు చేస్తాన‌ని కూడా మంత్రి చెప్ప‌డంతో పోలీసులు త‌ల ప‌ట్టుకుంటున్నారు. ఫ్లెక్సీల కోసం మంత్రి ఇంత‌ప‌ట్టింపు చేయ‌డ‌మేంట‌ని న‌వ్వుకుంటున్నారు.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/