Begin typing your search above and press return to search.
మేళతాళాలతో ఊళ్లోకి ఆ అమ్మాయికి అపూర్వ స్వాగతం..ఎందుకంటే?
By: Tupaki Desk | 3 Aug 2021 9:20 AM ISTఅవును.. ఆ అమ్మాయి ఊరుకు వస్తున్న వేళ.. మేళతాళాలతో.. పూలమాలలు వేసి మరీ ఘన స్వాగతం పలికారు. ఇక.. ఆ ఊళ్లో మహిళలంతా సంబరాలు చేసుకుంటున్నారు. వారి ఆనందానికి దన్నుగా ఆ ఊరి మగాళ్లు నిలిచిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అప్పటివరకు అమ్మాయిలకున్న ఇమేజ్ ను ఆమె పూర్తిగా మార్చేసింది. అంతేకాదు.. ఆమె ఒక స్ఫూర్తిగా మారింది. ఆమె ఎవరో కాదు.. ప్యారీ చౌధరీ. ఇంతకీ ఆమె సాధించిందేమిటి? అన్న విషయంలోకి వెళితే..
ఆమె తండ్రి కిస్తూరా రామ్. అతడిది ఆర్మీ బ్యాక్ గ్రౌండే. గతంలో భారతీయ సైన్యంలో పని చేసిన ఆయన 47 ఆర్మీ రెజిమెంట్ లో సుబేదార్ గా రిటైర్ అయ్యారు. తన కంటే తన కుమార్తె ఉన్నత స్థానంలో ఉద్యోగాన్ని సంపాదించటంపై ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇది ఆమె ప్రయాణంలో ప్రారంభం మాత్రమేనని.. రానున్న రోజుల్లో మరింత ఎత్తుకు ఎదగటం ఖాయమని చెబుతున్నారు.
జాతీయ స్థాయిలో జరిగిన పరీక్షలో మెరిట్ ఆధారంగా ప్యారీ ఈ జాబ్ ను సొంతం చేసుకున్నారు. ఆమెను చూసిన ఆ ఊరి అమ్మాయిలు తాము కూడా సాధించగలమన్న ఆత్మవిశ్వాసాన్ని సొంతం చేసుకొని.. విజయం సాధిస్తారని ఆశిద్దాం. ఆల్ ద బెస్టు చెబుదామా?
