Begin typing your search above and press return to search.

పద్మశ్రీ అందుకునేటప్పుడు పీవీ సింధు ధరించిన చీర ఖరీదు తెలిస్తే షాకే

By:  Tupaki Desk   |   14 Nov 2021 8:00 AM IST
పద్మశ్రీ అందుకునేటప్పుడు పీవీ సింధు ధరించిన చీర ఖరీదు తెలిస్తే షాకే
X
ఆటలోనే కాదు.. అందంలోనూ.. ఫ్యాషన్ ను అందిపుచ్చుకోవడంలో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు అందరికంటే ముందుంటున్నారు. ఫ్యాషన్ ప్రపంచంలోని కొత్త కొత్త డిజైన్లను అందిపుచ్చుకుంటున్నారు. ఎన్ని ఫ్యాషన్ లు వచ్చినా ఇప్పటికీ దేశంలో చీరకట్టు ఎవర్ గ్రీన్ ఫ్యాషన్. ఆ నిండుదనం చీరతోనే వస్తుంది. ముఖ్యంగా ఆడవారు పార్టీలు, ఫంక్షన్లకు వెళ్లేటప్పుడు చీరనే మొదటి ఆప్షన్ గా ధరిస్తారు.

బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు కూడా చీర అంటే మమకారం.. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా 'పద్మ భూషణ్' పురస్కారం అందుకోవడానికి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు చేనేత చీరకట్టులోనే వెళ్లడం విశేషం. ఆలీవ్ గ్రీన్ రంగు డబుల్ ఇక్కత్ పఠోలా చీర, దానిపై కాంచీవరం బ్లౌజు ధరించి సింధు చూపరులను కట్టిపడేసింది.

పద్మభూషణ్ అవార్డు అందుకునేటప్పుడు సింధు ధరించిన చీర ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె ధరించిన పటోలా చీరకు పెద్ద చరిత్రనే ఉంది.

పటోలా డబుల్ ఇక్కత్ చీరల తయారీ నైపుణ్యం గుజరాత్ లోని పటాన్ ప్రాంతంలో కొన్ని కుటుంబాలకే సొంతం. వాళ్లు కూడా ఆ రహస్యాన్ని తమ కొడుకులకు మాత్రమే చెబుతారు. ఈ చీర రెండువైపులా ఒకేలా ఉంటుంది. ఆఖరికి నేతన్న కూడా చీర పూర్తయ్యాక ఏది ముందు భాగం.. ఏది వెనుక భాగం అన్నది చెప్పలేరు. కొన్ని వందలఏళ్లు అయినా చీర రంగు చెరిగిపోదు.

ఈ డబుల్ ఇక్కత్ చీర నేయడానికి ఏడాది సమయం వరకూ పడుతుంది. ఇక పనితనాన్ని బట్టి ఈ చీర ఖరీదు అక్షరాల లక్ష నుంచి రూ.2 లక్షలకుపైగానే ఉంటుంది.