Begin typing your search above and press return to search.

న్యాయవాద దంపతుల హత్యపై తొలి సారి స్పందించిన పుట్టమధు

By:  Tupaki Desk   |   20 Feb 2021 5:00 PM IST
న్యాయవాద దంపతుల హత్యపై తొలి సారి స్పందించిన పుట్టమధు
X
న్యాయవాది వామనరావు దంపతుల హత్యపై పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్టమధు తొలి సారి స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలకు జవాబిచ్చారు. శనివారం మీడియాతో మాట్లాడిన పుట్ట మధు ‘తాను ఎక్కడికి వెళ్లలేదని.. ముఖం చాటేయలేదని' తెలిపారు. విచారణ పూర్తయ్యాక హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెడుతానని ప్రకటించారు.

తాను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దగ్గరికి వెళ్లలేదని.. వారిని అపాయింట్ మెంట్ కూడా అడగలేదని పుట్ట మధు క్లారిటీ ఇచ్చారు. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కుట్రలను తిప్పికొడుతానని పుట్టమధు అన్నారు. పోలీసులను విచారణ చేయనిస్తారా? లేక శ్రీధర్ బాబు చేస్తారా? అని పుట్ట మధు ప్రశ్నించారు. ఒక బీసీ జడ్పీ చైర్మన్ కావడాన్ని జీర్ణించుకోలేకనే తనపై విష ప్రచారం చేస్తున్నారని తప్పు పట్టారు.

న్యాయవాద దంపతుల హత్యపై మీడియా చేస్తున్న అసత్యప్రచారానికి కాంగ్రెస్ నేతలు తోడయ్యారని పుట్టమధు విమర్శించారు. న్యాయవాద దంపతుల హత్య జరిగిన తర్వాత తాను మంథనిలో ఉండడం లేదని.. ముఖం చాటేశానని కొన్ని పత్రికలు, టీవీ చానళ్లు అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.

కాంగ్రెస్ నేతలకు తొత్తుగా మారి అమ్ముడుపోయిన కొన్ని మీడియా సంస్థలు , టీవీ చానెళ్లు నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నాయని పుట్టమధు మండిపడ్డారు. ఆ మీడియా సంస్థలే తనను లోపలికి పంపడానికి ప్రయత్నిస్తున్నామని నిప్పుులు చెరిగారు.