Begin typing your search above and press return to search.

బతికున్నంత కాలం అధ్యక్షుడిగానే.. రాజ్యాంగ మార్పులకు రష్యా ప్రజల అండ

By:  Tupaki Desk   |   21 July 2020 3:40 PM IST
బతికున్నంత కాలం అధ్యక్షుడిగానే.. రాజ్యాంగ మార్పులకు రష్యా ప్రజల అండ
X
పదవి కాంక్ష ఎంతటి పనిని అయినా చేస్తుంది. అందుకే రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి. అధికారంలో ఉన్నవారు నిలబెట్టుకోవడానికి.. ప్రతిపక్షాలు అధికారంలోకి రావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు రష్యాలో అలాంటి అవకాశం లేదు. ప్రస్తుత అధ్యక్షుడే జీవిత కాలం కొనసాగనున్నాడు. ఆ మేరకు కొన్ని నెలల ముందే నిర్ణయాలు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఆ నిర్ణయాలకు ప్రజలు కూడా అండగా నిలబడ్డారు. దీంతో ప్రజల మద్దతుతో వ్లాదిమిర్ పుతిన్ బతికినన్నాళ్లు రష్యా అధ్యక్షుడిగా కొనసాగనున్నారు.

ఈ మేరకు రాజ్యాంగ మార్పులు చేశారు. మరో రెండు దశాబ్దాల పాటు పుతిన్ అధ్యక్షుడిగా ఉండనున్నారు. దీనికి 78 శాతం రష్యన్ ప్రజలు పుతిన్ కు అండగా నిలబడ్డారు. అయితే ఈ నిర్ణయం మాత్రం ప్రత్యర్ధులు.. ప్రతిపక్షాలకు మాత్రం రుచించడం లేదు.