Begin typing your search above and press return to search.

'స్పుత్నిక్-వీ' వ్యాక్సిన్ వికటించి పుతిన్ కూతురు మృతి..వ్యాక్సిన్ పై అనుమానాలు - అసలు నిజమేంటి!

By:  Tupaki Desk   |   20 Aug 2020 12:02 PM IST
స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ వికటించి పుతిన్ కూతురు మృతి..వ్యాక్సిన్ పై అనుమానాలు - అసలు నిజమేంటి!
X
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి ని అరికట్టడానికి ఎన్నో దేశాలు వ్యాక్సిన్ తయారీలో ఉండగానే , అందరూ షాక్ అయ్యాలే అమెరికా, చైనా కంటే ముందుగానే కరోనా వ్యాక్సిన్ ను తీసుకొచ్చింది రష్యా. స్పుత్నిక్-వీ పేరుతో రూపొందిన ఆ వ్యాక్సిన్ మొదటి డోసును అధ్యక్షుడు పుతిన్ కూతురికి వేశారు. ఈనెల 11న మాస్కోలో జరిగిన ప్రెస్ మీట్ లో పుతిన్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడంచారు. అయితే డోసు తీసుకున్న మూడు రోజులకే వికటించడంతో పుతిన్ కూతురు మరణించిందంటూ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అవుతున్నాయి.

స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ ను లాంచ్ చేసిన మొదటి రోజు నుండే ఆ వ్యాక్సిన్ పై పెద్ద ఎత్తున అనుమానాలు ఉత్పన్నం అవుతున్నాయి. ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ధిష్ట పద్ధతుల్లో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించకుండానే రష్యా వ్యాక్సిన్ ను ప్రకటించిందని, ఆ వ్యాక్సిన్ వాడితే కరోనా తగ్గడం అటు ఉంచితే , కొత్త సమస్యలు వచ్చే అవకాశముందని అమెరికా, యూరప్ దేశాలకు చెందిన పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. దీంతో, ప్రపంచంలోనే మొదటి కరోనా వ్యాక్సిన్ అంటూ రష్యా చేసిన ప్రకటనపై చాలా దేశాలు దానిపై అంతగా ఆసక్తి చూపించలేదు. ఇలా రష్యా తయారుచేసిన స్పుత్నిక్ పై అనుమానాలు పెరుగుతున్నసమయంలో .. పుతిన్ కూతురి వార్తలు సంచలనంగా మారాయి.

రష్యా ఆరోగ్య శాఖ సహకారంతో గమలేయా రీసెర్చ్‌ ఇన్‌ స్టిట్యూట్ అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ ప్రధానంగా అడినో వైరస్‌ భాగాలతో రూపొందించారు. దాన్ని తీసుకుంటే, రోగనిరోధక శక్తి పెరిగి, శరీరం కరోనాను తట్టుకునే స్థితికి చేరుతుందని రష్యా సైంటిస్టులు చెప్పారు. కాగా, తొలి డోసు తీసుకున్న పుతిన్ కూతురు.. ఈనెల 15న అకాలమరణం చెందిందని పలు అంతర్జాతీయ వెబ్ సైట్లు ఓ పేక్ తప్పుడు వార్తలు రాశాయి. రష్యా ప్రభుత్వం దీనిపై వివరణ ఇవ్వకపోవడంతో ఫేక్ న్యూస్ మరింత జోరుగా వ్యాపించాయి. నిజానికి పుతిన్ కూతురు చనిపోలేదని, ఫ్యాక్ట్ ఫైండర్లు వెల్లడించారు. అలాగే ఆ రష్యా తయారుచేసిన స్పుత్నిక్ వల్ల ఇప్పటిదాకా ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని అధికారులు వెల్లడించారు. రష్యాకు వ్యతిరేకంగా అమెరికా, చైనానే ఈ కుట్రలు చేస్తూఉంటారనే ఫేక్ వార్తలు సృష్టించి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.