Begin typing your search above and press return to search.

పుతిన్ మూడు డిమాండ్లు.. ఉక్రెయిన్ నో.. రష్యా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం

By:  Tupaki Desk   |   1 March 2022 8:30 AM GMT
పుతిన్ మూడు డిమాండ్లు.. ఉక్రెయిన్ నో.. రష్యా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం
X
రష్యా-ఉక్రెయిన్ మధ్య చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. ఇరు దేశాల అధికారులు బెలారస్ సరిహద్దుల్లోని గోమెల్ లో సమావేశమై చర్చించారు. కీలక నిర్ణయాలేవీ జరగలేదు. మరోమారు ఈరోజు సమావేశం కావాలని నిర్ణయించారు. తమ దేశంతోపాటు క్రిమియా, డాన్ బాస్ ప్రాంతాల నుంచి బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలని రష్యాను ఉక్రెయిన్ డిమాండ్ చేసింది.

ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ ముందుట మూడు డిమాండ్లు పెట్టారు. ‘క్రిమియాపై రష్యా సార్వభౌమత్వాన్ని గుర్తించాలి. ఉక్రెయిన్ తటస్థ దేశంగా కొనసాగాలి. నాటో సభ్యత్వ డిమాండ్ ను శాశ్వతంగా వదలుకోవాలి. అప్పుడే యుద్ధం ఆగుతుంది’ అని పుతిన్ స్పష్టం చేశారు. చర్చలు రెండో దఫా చర్చలు పోలెండ్-బెలారస్ సరిహద్దుల్లో త్వరలో జరిగే అవకాశం ఉందని ఉక్రెయిన్ అధ్యక్ష సలహాదారు మైకోలియో పోడోలర్ తెలిపారు.

చర్చల నేపథ్యంలో ఉక్రెయిన్ తరుఫున రక్షణ మంత్రితోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రష్యా నుంచి మాత్రం పుతిన్ సాంస్కృతిక సలహాదారుతోపాటు ఇతర అధికారులు వచ్చారు.దీంతో పుతిన్ ఈ చర్చలపై ఆసక్తి పెద్దగా లేదని నిపుణులు భావిస్తున్నారు. చర్చలు జరుగుతుండడంతో ఉక్రెయిన్ రాజధాని, ఇతర నగరాల్లోకి చొచ్చుకొస్తున్న రష్యాసేనల దూకుడు ఆదివారం కాస్త తగ్గింది. సంఖ్యలో తక్కువగా ఉన్న ఉక్రెయిన్ బలగాలు పలు చోట్ల సాధ్యమైనంతర మేర రష్యా చొరబాటును అద్డుకుంటున్నాయి.

-రష్యా ఆర్థిక పరిస్తితి అతలాకుతలం

ప్రపంచ పాశ్చాత్య దేశాల ఆంక్షల ప్రభావం రష్యాపై గట్టిగానే పడుతోంది. ఆర్థికంగా ఇప్పటికే పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దేశ కరెన్సీ రూబుల్ విలువ శరవేగంగా పడిపోతోంది. యుద్ధానికి ముందు డాలర్ కు 80 రూబుల్స్ లోపే ఉండేది. అది కాస్తా ఇప్పుడు ఏకంగా 96 రూబుల్స్ కు దిగజారింది.

గత వారం, పదిరోజులతో పోలిస్తే సోమవారం ఉదయం ఒక దశలో డాలర్ తో రూబుల్ విలువ 30శాతం దాకా పడిపోయింది. స్విఫ్ట్ వ్యవస్థ నుంచి ప్రధాన రష్యా బ్యాంకులను బహిష్కరించడం..ఎగుమతులు, దిగుమతులపై భారీ ప్రభావమే చూపుతోంది. దాంతో దేవంలో నిత్యావసరాల ధరలు కూడా నింగినంటేలా కనిపిస్తున్నాయి.

ఈ పరిణామాలతో రషన్లు బెంబేలెత్తిపోతున్నారు. దాంతో డబ్బులు డ్రా చేసుకునేందుకు సోమవారం దేశవ్యాప్తంగా బ్యాంకులు, ఏటీఎంల ముందు జనం బారులు తీరి కనిపించారు. గూగుల్ పే తదితర పేమెంట్ యాప్స్ ద్వారా కూడా చెల్లింపులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. దిగుమతి వస్తువులపై కూడా భారం పడుతోంది.