Begin typing your search above and press return to search.

జగన్ ఎత్తుకున్న ఆ చిన్నారి ఎవరు?

By:  Tupaki Desk   |   25 Feb 2021 3:40 PM IST
జగన్ ఎత్తుకున్న ఆ చిన్నారి ఎవరు?
X
ఏం చేసినా నిండు మనసుతో చేయాలి. ఆ విషయంలో ఏ మాత్రం వంక పెట్టలేని విధంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీరు కనిపిస్తూ ఉంటుంది. ఈ యువనేత కొన్ని సందర్భాల్లో స్పందించేతీరు.. భావోద్వేగానికి గురయ్యే వైనం విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఉన్నత స్థానాల్లో ఉన్న వారి వద్దకు.. అత్యుత్తమ పదవుల్ని చేపట్టిన వారి వద్దకు చాలామంది వచ్చి పోతుంటారు. అయితే.. వారి విషయంలో వ్యవహరించే తీరు ఒక్కో నేత ఒక్కోలా ఉంటారు. చాలామంది వారు వచ్చారు.. మేం స్పందించామన్నట్లుగా ఉంటే.. జగన్ లాంటి అధినేత మాత్రం నిండు మనసుతో రియాక్టు కావటం కనిపిస్తుంది.

తాజాగా వైరల్ అవుతున్న ఈ ఫోటోను చూస్తే.. చిన్న పిల్లలు అంటే జగన్ కు ఎంత ప్రేమ.. మమకారం అన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి తన భర్త.. ఇటీవలే పుట్టిన పాపను తీసుకొని సీఎం క్యాంప్ ఆఫీసుకు వచ్చారు. వారిని సాదరంగా ఆహ్వానించిన సీఎం జగన్.. ఆ పాపను ఎత్తుకొని.. ఆడించి ముద్దు చేశారు. ఈ సందర్భంగా ఆయన ముఖంలో కనిపించిన ఆనందం.. ఆ చిన్నారిని ఎత్తుకొని ముద్దాడిన తీరు అందరిని ఆకర్షిస్తున్నాయి. అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.