Begin typing your search above and press return to search.
దగ్గుబాటి పురందేశ్వరి ఇప్పుడు...మారిన మనిషి
By: Tupaki Desk | 26 Aug 2017 6:31 PM ISTతెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన దివంగత సీఎం నందమూరి తారకరామారావు తనయ - మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధీశ్వరి ఇప్పుడు మారిన మనిషి అని రాజకీయవిశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే తన తండ్రి స్థాపించిన పార్టీని నందమూరి వారి అల్లుడైన చంద్రబాబు కైవసం చేసుకున్నప్పటికీ నుంచి టీడీపీ పొడ అంటేనే ఏపీ చిన్నమ్మకు గిట్టదనే సంగతి తెలిసిందే. అయితే అలాంటి చిన్నమ్మ ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. ఏకంగా తెలుగుదేశం పార్టీ కండువా వేసుకున్నారు!
అవును నిజంగా నిజం. తెలుగుదేశం పార్టీ పసుపుపచ్చ కండువా వేసుకొని పురంధీశ్వరి ప్రచారం నిర్వహించారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ చిత్రం చోటుచేసుకుంది. తెలుగుదేశం - బీజేపీలు మిత్రపక్షాలనే సంగతి తెలిసిందే. ఈ రెండు పార్టీల అభ్యర్థుల ప్రచార పాల్గొన్న పురంధీశ్వరి ఈ సందర్భంగా టీడీపీ కండువా వేసుకొని ప్రచారం నిర్వహించారు. ఈ పరిణామం అందరిలోనూ ఆసక్తి రేకెత్తించిన నేపథ్యంలో మీడియా ఆమెను పలకరించింది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ పొత్తుపై నీలినీడలు కమ్ముకున్న నేపథ్యంపై కూడా పురంధీశ్వరి స్పందించారు.
భవిష్యత్‌లోనూ ఏపీలో పొత్తు ఉంటుందని పురందీశ్వరి స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో పొత్తుల గురించి తమ ఢిల్లీ పెద్దలు నిర్ణయం తీసుకుంటారని పురంధీశ్వరి తెలిపారు. ఇప్పటివరకు తాము తెలుగుదేశంతో మిత్రపక్షంగా ఉన్నామని పేర్కొంటూ ఈ మైత్రిని గౌరవిస్తామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీతో కలిసి సాగనున్నారా? అనే అంశంపై అది తమ జాతీయ నాయకత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని అన్నారు.