Begin typing your search above and press return to search.

వైసీపీలోకి పురంధేశ్వ‌రి... నియోజ‌క‌వ‌ర్గం ఓకే!!

By:  Tupaki Desk   |   28 Feb 2017 11:08 AM IST
వైసీపీలోకి పురంధేశ్వ‌రి... నియోజ‌క‌వ‌ర్గం ఓకే!!
X
తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాపకుడు - దివంగ‌త‌ ఎన్‌ టిఆర్‌ కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీకి గుడ్ బై చెప్ప‌నున్నారా? విభజన సమయంలో హడావుడిగా బీజేపీ కండువా కప్పుకున్న పురంధేశ్వ‌రికి కాషాయ పార్టీకి రాంరాం చెప్పి ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్నారా? చిన్న‌మ్మ‌ను వైసీపీలోకి తీసుకువ‌చ్చే విష‌యంలో వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా మంత్రాంగం న‌డిపిస్తున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది.

విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం బీజేపీ రాజకీయాలు పురంధేశ్వ‌రికి స‌రిగా సూట్ అవ‌డం లేద‌ని తెల‌స్తోంది. కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా ఓ వెలుగు వెలిగిన ఆమె ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏపీ విభ‌జ‌న‌ను నిర‌సిస్తూ బీజేపీలో చేరారు. 2014లో రాజంపేట పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న పురంధేశ్వ‌రికి ఏపీలో ఆ పార్టీ ఎదుగుద‌ల‌పై స్ప‌ష్ట‌త కనిపించ‌డం లేద‌ని అంటున్నారు. అందుకే ఆమె త్వ‌ర‌లో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఎమ్మెల్యే రోజా ద్వారా పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ ప్ర‌తిపాద‌న‌ను వైఎస్ ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి వ‌ద్ద‌కు రోజా తీసుకువెళ్ల‌గా ఆయ‌న సానుకూలంగా స్పందించిన‌ట్లు తెలుస్తోంది. గతంలో విశాఖ ఎంపీగా ఉన్న పురంధీశ్వ‌రికి ఆ నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. ఈ నేపథ్యంలోనే విశాఖ నుంచి 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సూచనప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. పురంధేశ్వరి వైసీపీ తీర్థం పుచ్చుకుంటే ఆ జిల్లాలో ఆ పార్టీకి బలం మరింత పెరిగే అవకాశం ఉన్నందున సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విష‌య‌మై త్వ‌ర‌లోనే క్లారిటీ రానున్న‌ట్లు చెప్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/