Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: ఏపీ- తెలంగాణల్లో ఇద్దరు దిగ్గజ నేతలకు కరోనా

By:  Tupaki Desk   |   30 Sept 2020 10:45 AM IST
బ్రేకింగ్: ఏపీ- తెలంగాణల్లో ఇద్దరు దిగ్గజ నేతలకు కరోనా
X
ఏపీ, తెలంగాణలో కరోనా ఉధృతి తగ్గడం లేదు. బయటకొచ్చి వివిధ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటే చాలు కరోనా చుట్టేస్తోంది. ఇటీవల తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఇద్దరు మంత్రులు కరోనా బారినపడ్డారు. హైదరాబాద్ తో పాటు ఏపీ లోని జిల్లాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది.

ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో కరోనా బారినపడుతున్న ప్రజాప్రతినిధుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు వరుసగా ఈ మహమ్మారి బారినపడుతున్నారు.

ఇప్పటికే పలువురు నేతలకు కరోనా సోకగా.. తాజాగా తెలంగాణ మాజీ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వైద్యుల సలహా మేరకు ఆయన హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు.

ఇక ఇటీవలే బీజేపీ జాతీయ కార్యదర్శిగా నియామకమైన పురంధేశ్వరి రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. ఢిల్లీ లో, ఏపీ లో పర్యటించారు. ఈ క్రమం లోనే పురంధేశ్వరికి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నట్టు తెలిసింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు కీలక నేతలు కరోనా బారినపడడం కలకలం రేపుతోంది.