Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబుపై చిన్న‌మ్మ సెటైర్లు

By:  Tupaki Desk   |   3 Sept 2016 5:02 PM IST
చంద్ర‌బాబుపై చిన్న‌మ్మ సెటైర్లు
X
సొంత ఫ్యామిలీ ప‌ర్స‌నే అయినా.. పొలిటిక‌ల్‌ గా చంద్ర‌బాబుపై ప‌రోక్ష విమ‌ర్శ‌లు చేస్తూనే ఉంటారు నంద‌మూరి ఫ్యామిలీ ఆడ‌ప‌డుచు - కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వ‌రి. సోద‌రి భ‌ర్త అయిన చంద్ర‌బాబుపై ఆమె నేరుగా విమ‌ర్శ‌లు చేయ‌క‌పోయినా.. ఎప్పుడు పాలిటిక్స్ మాట్లాడాల్సి వ‌చ్చినా చుర‌క‌లు అంటిస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా బాబును వ‌దిలిపెట్ట‌ని పురందేశ్వ‌రి.. ఓటుకు నోటు కేసుపై త‌న స్టైల్లో స్పందించారు. ఇటీవ‌ల వైకాపా మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి.. ఓటుకు నోటు కేసుపై ఏసీబీ కోర్టులో పిటిష‌న్ వేసిన సంగ‌తి తెలిసిందే.దీంతో ఆ కోర్టు.. తిరిగి ఈ కేసును విచారించాల‌ని ఆదేశించింది.

దీంతో చంద్ర‌బాబు చుట్టూ నెట్ బిగిసింద‌ని విప‌క్షం తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించింది. ఇంత‌లో చంద్ర‌బాబు దీనిపై హైకోర్టుకు వెళ్లి.. విచార‌ణ‌పై స్టే తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇదే విష‌యంపై చిన్న‌మ్మ శ‌నివారం మాట్లాడారు. ఆళ్ల పిటిష‌న్‌ తో పున‌ర్విచార‌ణ జ‌రిగి... ఆ కేసులో చంద్ర‌బాబు క‌డిగిన ముత్యంలా బ‌య‌ట‌ప‌డ‌తార‌ని ఆశించిన‌ట్టు చెప్పారు. అస‌లు త‌న దృష్టిలో ఈ కేసు మ‌రోసారి విచార‌ణ జ‌ర‌గడం చంద్ర‌బాబుకు గుడ్ ఛాన్స్‌ గా పురందేశ్వ‌రి పేర్కొన్నారు. అయితే, చంద్రాబాబు ఇంత‌లోనే హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవ‌డంపై ఆమె అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఇలా చేస్తార‌నుకోలేద‌ని కామెంట్లు కురిపించారు.

ఏదేమైనా స్టే తెచ్చుకోకుండా.. విచార‌ణ‌కు వెళ్లి.. ఉంటే చంద్ర‌బాబు నిజాయితీ బ‌య‌ట‌కు వ‌చ్చేద‌ని చెప్పారు. ఇక‌, ఏపీ ప్ర‌త్యేక హోదాపైనా చిన్న‌మ్మ కామెంట్లు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని తెలిసి కూడా కొందరు వివాదం చేస్తున్నారని అన్నారు. అయితే, విభ‌జ‌న‌తో న‌ష్ట పోయిన ఏపీకి అన్ని విధాలుగా కేంద్రం సహాయం చేస్తుందని భ‌రోసా వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. ఇప్పటికీ ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తే.. త‌మ‌కు కూడా ఇవ్వాల‌ని అనేక రాష్ట్రాలు ప‌ట్టుబ‌డుతున్నాయ‌ని, అలా ఇవ్వ‌డం సాంకేతికంగా సాధ్యం కాద‌ని పురందేశ్వ‌రి తేల్చిచెప్పారు. కాబ‌ట్టి ప్యాకేజీ గ్యారెంటీ అని స్ప‌ష్టం చేశారు.