Begin typing your search above and press return to search.
జాతిపిత మోదీనా?..ట్రంప్ కామెంట్లకు పురందేశ్వరి దన్ను
By: Tupaki Desk | 25 Sept 2019 10:13 AM ISTభారత జాతిపిత ఎవరంటే... దేశ ప్రజలంతా ఏమాత్రం ఆలోచించకుండానే మహాత్మా గాంధీ పేరు చెప్పేస్తారు. అలాంటిది ఇప్పుడు మహాత్మా గాంధీ స్థానంలో ఇకపై మనం ప్రదాని నరేంద్ర మోదీ పేరును చెప్పుకోవాలేమో. నిజమా? అంటే.. ప్రస్తుతం జరుగుతున్న తంతు చూస్తుంటే.. నిజమేనని ఒప్పుకోక తప్పదు. దేశ ప్రజలంతా మౌనంగా ఉండిపోతే.. కమలనాథులు జాతిపిత స్థానంలో మహాత్ముడి పేరు తీసేసి మోదీ పేరును ఇరికించేసేలానే ఉన్నారన్న వాదనలు కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. దేశానికి స్వాతంత్య్రం సాధించిన మహాత్మా గాంధీ ఎక్కడ... తన రాజకీయం కోసం ప్రత్యర్థి పార్టీలపై ఉక్కుపాదం మోపుతున్న మోదీ ఎక్కడ అన్న విశ్లేషణలు కూడా మొదలైపోయాయి.
అయినా మోదీని జాతిపితను చేసిందెవరు? ఆ మాటకు వత్తాసు పలుకుతూ దేశ ప్రతిష్ఠనే మంటగలిపేలా వ్యవహరించిందెవరన్న వివరాల్లోకి వెళితే... భారత ప్రధాని హోదాలో మోదీ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు కదా. మొన్న హౌడీ మోదీ పేరిట అమెరికాలో నిర్వహించిన సభకు అక్కడి ఎన్నారైలు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ సభకు హాజరైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ జనసందోహాన్ని చూసి కేరింతలు కొట్టినంత పనిచేశారు. ఈ సందర్భంగా మోదీ జన సమ్మోహనానికి ముగ్దుడైన ట్రంప్... ఏదో భారత చరిత్ర తెలుసుకోకుండా మోదీని ఆకాశానికెత్తేస్తూ ఓ సంచలనాత్మక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లోని భావం బాగానే అర్థమవుతున్నా.. తమ పార్టీ నేత అన్న భావనతో బీజేపీ మహిళా నేత - కేంద్ర మాజీ మంత్రి - టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు తనయ దగ్గుబాటి పురందేశ్వరి... సదరు ట్వీట్ కు వత్తాసు పలికి... మోదీని జాతిపితగా పరిగణించాల్సిందేనన్నట్లుగా వ్యవహరించారు.
ట్రంప్ ట్వీట్ లో ఏముందన్న విషయానికి వస్తే... మోదీని గ్రేట్ జెంటిల్మన్ గా అభివర్ణించిన ట్రంప్... మోదీని గ్రేట్ లీడర్ గానూ ఆకాశానికెత్తేశారు. అంతేకాకుండా మోదీ ప్రధాని కాకముందు భారత్ చిందరవందరగా ఉందని, దేశంలోని అన్ని భాగాలను ఒక్క దరికి చేర్చడంలో మోదీ సక్సెస్ అయ్యారని, వెరసి జాతిపితగా మారారని ట్రంప్ ట్వీటారు. అంతటితో ఆగని ట్రంప్... ఓ తండ్రిలా మోదీ దేశాన్ని సంఘటితం చేశారని, అందుకే ఆయనను తాను భారత జాతిపితగా పరిగణిస్తున్నామని సంచలన కామెంట్లు చేశారు. సరే... ట్రంప్ ఓ అమెరికన్. అంతేనా మొన్నటిదాకా రియల్ ఎస్టేట్ బిజినెస్ చూసుకుంటూ... ఏదో అలా గాలివాటంగా రాజకీయాల్లోకి వచ్చేశారు. నసీబ్ బాగుండి అమెరికాకు అధ్యక్షుడిగానే కూడా అయ్యారు. అంతమాత్రాన భారత్ గురించి అంతా తనకు తెలుసన్నట్లుగా ట్రంప్ వ్యవహారం చూస్తుంటే.. నిజంగానే కోపం నషాళానికి అంటక మానదు.
సరే... ట్రంప్ అంటే భారత చరిత్ర గురించి, ప్రపంచ చరిత్ర గురించి తెలియని నేతే అనుకున్నా... భారత జాతిపితగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న మహాత్మా గాంధీనే అవమానించేలా ట్రంప్ చేసిన ట్వీట్ ను సాధారణంగా భారత్ కు చెందిన ఎవరైనా ఖండించాల్సిందే. లేదంటే మన చరిత్ర గురించి ట్రంప్ కు ఏం తెలుసులే అని మౌనంగా ఉండాల్సిందే. అయితే భారత చరిత్రపైనే కాకుండా భారత స్వాతంత్య్ర పోరాటం, అందులో మహాత్మా గాంధీ పాత్ర, ఆయనను జనం గుండెల్లో పెట్టుకున్న తీరుపై ఫుల్ క్లారిటీ ఉన్న పురందేశ్వరి అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. మోదీని భారత జాతిపితగా అభివర్ణిస్తూ ట్రంప్ చేసిన ట్వీట్ ను లైక్ చేయడంతో పాటుగా తన ట్విట్టర్ ఖాతాకు ట్యాగ్ చేసి మరీ పెను కలకలం రేపారు. ఈ చర్యతో మోదీని ఆమె భారత జాతిపితగానే భావిస్తున్నట్టుగా ఉందన్న వాదన వినిపిస్తోంది. ట్రంప్ ట్వీట్, దానికి పురందేశ్వరి వత్తాసుపై ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పేలుతున్నాయి. ట్రంప్ తో పాటు పురందేశ్వరిని నెటిజన్లు ఓ రేంజిలో ట్రోల్ చేస్తున్నారు.