Begin typing your search above and press return to search.
బాబు మాట సరే.. మీరేం చేస్తారు చిన్నమ్మ?
By: Tupaki Desk | 14 Aug 2016 10:10 AM ISTఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలోని మోడీ సర్కారు ఏవిధంగా వ్యవహరిస్తుందో ఐదు కోట్ల ఆంధ్రులంరికి బాగా తెలుసు. కోట్లాది మంది ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన అంశమైనా.. ఈ విషయంపై మాట్లాడేందుకు.. పెదవి విప్పేందుకు ఏపీకి చెందిన బీజేపీ నేతలంతా ఇష్టపడని వైనం కనిపిస్తుంది. అధినాయకత్వానికి ఆగ్రహం కలగకుండా ఉండేలా చూడటం తప్పించి.. ఏపీ ప్రజల ప్రయోజనాలు అస్సలు పట్టవు. మిగిలినరాష్ట్రాల్లో ఎక్కడైనా.. స్థానిక ప్రజల ప్రయోజనాల ముందు పార్టీ అధినాయకత్వాన్ని సైతం ప్రశ్నించటం కనిపిస్తుంది.
కానీ.. అందుకు భిన్నమైన పరిస్థితులు ఏపీ బీజేపీలో ఉన్నాయి. ప్రత్యేక హోదా అంశంపై ఏపీలోని అన్ని రాజకీయ పార్టీల స్టాండ్ ఒకలా ఉంటే.. ఏపీ బీజేపీ నేతలు తీరుమాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. ఇప్పటివరకూ ఏపీ కమలనాథులు.. హోదా మీద తమ స్టాండ్ ను సూటిగా చెప్పింది లేదు. ఎప్పటికప్పుడు ఏపీ అధికారపక్షం మీద విమర్శలు చేయటం.. వారి విధానాల్నితప్పు పట్టటం మినహా వారంతట వారుగా చేసిందేమీ కనిపించదు.
తాజాగా ఏపీ బీజేపీకి చెందిన పురంధేశ్వరి మాటలు వింటే ఈ వ్యవహారం మరింత స్పష్టంగా అర్థమవుతుంది. హోదా విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం చేయాలో చెప్పే ఆమె.. హోదా అంశంపై తమ పార్టీ స్టాండ్ ను మాత్రం ఆమె చెప్పరు. ఏపీకి హోదా విషయంలో తమ పార్టీ అగ్రనాయకత్వం సానుకూలంగా లేరన్న విషయం స్పష్టంగా తెలిసిన తర్వాత.. ఆ విషయంలో వారిని ఒప్పించటం.. వారి మీద ఒత్తిడి తీసుకురావటం.. హోదా ఇవ్వకపోతే జరిగే నష్టాన్ని అర్థమయ్యేలా వివరించాల్సి ఉన్నా.. అలాంటి పని చేయని పురంధేశ్వరి అండ్ కో.. ఏపీ ముఖ్యమంత్రి ఏం చేయాలో మాత్రం చిలక పలుకుల మాదిరి పలుకుతుంటారు.
ఏపీకి హోదా ఇవ్వాలంటే 13 రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులను ఒప్పించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఏపీ హోదాకు 13 రాష్ట్రాల సీఎంలను ఒప్పించాలని చెబుతున్న పురంధేశ్వరి.. బీజేపీ నేతృత్వంలో అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులను తాము ఒప్పిస్తామని.. మిగిలిన వారిని ఒప్పించే బాధ్యత తీసుకోమంటే బాగుండేది. అందుకు భిన్నంగా ముఖ్యమంత్రుల్ని బాబు ఒప్పించాలంటూ చేస్తున్న ప్రకటనలు చూస్తే.. చిన్నమ్మ ఆలోచన ఏమిటన్నది ఇట్టే అర్థం కాక మానదు. ఇలాంటి ‘‘చిన్నమ్మ’’ల ధోరణే ఏపీ ప్రత్యేక హోదా రాకుండా అడ్డుపడుతున్నాయన్న విషయం ఏపీ ప్రజలు ఎంత త్వరగా గ్రహిస్తే.. అంత మంచిది. లేకుండా మరింత నష్టపోవటం ఖాయం.