Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్ పాలనపై పురంధేశ్వరి నిప్పులు

By:  Tupaki Desk   |   26 April 2021 10:00 PM IST
టీఆర్ఎస్ పాలనపై పురంధేశ్వరి నిప్పులు
X
దుబ్బాక, జీహెచ్ఎంసీలో గెలిచి జోష్ మీదున్న బీజేపీ ఇప్పుడు వరంగల్, ఖమ్మం మున్సిపల్ ఎన్నికలపై దృష్టిసారించింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో దూకుడుగా వెళుతోంది.

ఈ రెండు కార్పొరేషన్ల పరిధిలో హోరాహోరీగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి టీఆర్ఎస్ బీజేపీలు. తాజాగా బీజేపీ తరుఫున ఏపీ బీజేపీ నాయకురాలు, బీజేపీ జాతీయ కార్యదర్శి పురంధేశ్వరి సైతం ఖమ్మంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఖమ్మంలో బీజేపీ గెలుస్తుందని.. దేశ సమగ్రాభివృద్ధి కోసం నరేంద్రమోడీ నాయకత్వంలో పనిచేస్తామని దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు.

ఈ సందర్భంగా టీఆర్ఎస్ పాలనపై పురంధేశ్వరి తీవ్ర విమర్శలు చేశారు. ఆరేళ్ల కేసీఆర్ పాలనలో ఖమ్మంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ప్రజలు చూస్తున్నారని విమర్శించారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఎన్నికల్లో ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు.

టీఆర్ఎస్ మంత్రి పువ్వాడ తన భార్యను కూడా ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పించారని.. ఆయనకు ఓటమి భయం పట్టుకుందని పురందేశ్వరి విమర్శించారు. ఖమ్మంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని అడ్డుకున్న శక్తులు ఎవరనేది గుర్తించాలని ఖమ్మం ప్రజలను పురంధేశ్వరి కోరారు.