Begin typing your search above and press return to search.

జైళ్లలో సంసారం.. సంచలన నిర్ణయాన్ని తీసుకున్న పంజాబ్ ప్రభుత్వం

By:  Tupaki Desk   |   22 Sept 2022 8:00 AM IST
జైళ్లలో సంసారం.. సంచలన నిర్ణయాన్ని తీసుకున్న పంజాబ్ ప్రభుత్వం
X
నేరాలు చేసి జైళ్లలో శిక్షలు అనుభవించే ఖైదీలకు తీపికబురు చెప్పింది పంజాబ్ ప్రభుత్వం. దేశంలో మరే రాష్ట్రంలో లేని రీతిలో.. పంజాబ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జైళ్లల్లో తొలుత మూడు జైళ్లలోని ఖైదీలు దాంపత్య జీవితాన్ని అనుభవించేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నారు. దీనికి సంబంధించిన కీలక మార్గదర్శకాల్ని అక్కడి ప్రభుత్వం సిద్ధం చేసింది. దీంతో.. జైళ్ల సంస్కరణలో సరికొత్త విధానాన్ని తెర మీదకు తీసుకొచ్చినట్లుగా చెప్పాలి.

అయితే.. జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు సంసారం చేసుకోవటానికి వీలుగా కల్పించే ఈ అవకాశం అందరికి కాదని.. కొందరికి మాత్రమేనని చెబుతున్నారు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు.

ఇకపై ఖైదీలు తమజీవిత భాగస్వామ్యులతో ఏకాంతంగా ఉండే అవకాశాన్ని కల్పిస్తున్నారు. నిన్న (మంగళవారం)టి నుంచి మూడు జైళ్లలో ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు.

ఈ మూడు జైళ్లలో ఒకటి గోఇంద్ వాల్ సాహిబ్ కేంద్ర కారాగారం ఒకటైతే.. నాభా జిల్లా జైలు రెండోది.. మూడోది బఠిండా మహిళా జైలుగా నిర్ణయించారు.

ఈ జైల్లో ఉండే ఖైదీల్లో చక్కటి ప్రవర్తన కలిగి.. తీవ్రమైన నేరాలకు పాల్పడకుండా ఉండే ఖైదీలు తమ జీవిత భాగస్వామ్యులతో ఏకాంతంగా గడిపే అవకాశాన్ని ఇస్తున్నారు. అయితే.. గ్యాంగ్ స్టర్లు.. లైంగిక నేరాల్లో శిక్ష అనుభవిస్తున్న వారికి మాత్రం ఈ వెసులుబాటు కల్పించరు.

జైల్లో చక్కటి ప్రవర్తన కలిగిన ఖైదీలకు మూడు నెలలకు ఒకసారి రెండు గంటల చొప్పున ప్రత్యేక గదుల్లో వారు ఏకాంతంగా ఉండేందుకు అనుమతిస్తారు. ఈ గదుల్లో అటాచ్ బాత్రూం కూడా ఏర్పాటు చేశారు. జైల్లో ఉన్న సీనియర్ ఖైదీలకు తొలుత ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఈ నిర్ణయం ఖైదీల తీరుపై పెను ప్రభావాన్ని చూపుతుందని.. ఖైదీల ప్రవర్తనలో మార్పు వచ్చే అవకాశం ఉందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.