Begin typing your search above and press return to search.

సోషల్ మీడియా ను షేక్ చేస్తున్న పుంగనూరు జాతి బుజ్జి ఆవు .. ప్రత్యేకత ఏమిటంటే !

By:  Tupaki Desk   |   18 Feb 2021 8:00 AM IST
సోషల్ మీడియా ను షేక్ చేస్తున్న పుంగనూరు జాతి బుజ్జి ఆవు .. ప్రత్యేకత ఏమిటంటే !
X
పుంగనూరు ఆవులు సాధారణ గోవులకంటే భిన్నమైన పూర్తి దేశీయ రకం. బహు అరుదైన ఈ రకం ఆవులు ఒకటి, రెండు ఉంటే ఎంతో గొప్ప. ప్రపంచంలోనే పొట్టి ఆవులుగా పుంగనూరు ఆవులు గుర్తింపు పొందాయి. ప్రస్తుతం ఇవి అంతరించి పోయే దశకు చేరుకున్నాయి. ఇవి కేవలం 3-4 అడుగుల ఎత్తు వరకే పెరుగుతాయి. రోజుకు 4-5 లీటర్ల పాలు ఇస్తాయి.

చిత్తూరు జిల్లాలోని పుంగనూరు లో ఈ జాతి ఆవులుంటాయి. ఇక బరువు కూడా 150 నుంచి 200 కేజీలు ఉంటాయని తెలుస్తోంది. అయితే పాలు మాత్రం రోజు 4 నుంచి 5 లీటర్ల వరకూ ఇస్తాయని.. అవి చాలా చిక్కగా ఉంటాయి. ఈ వీడియో ను షేర్ రాజీవ్ కృష్ణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహా దారుగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకూ సర్వ సాధారణంగా పిల్లులు, కుక్కలు వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. తాజాగా ఈ ఆవు వీడియో ప్రత్యేకం అని కొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఆ దూడను ముచ్చటగా అలంకరించారు దాని యజమాని. అందమైన గంటలు కట్టడంతో అది కదులుతుంటే గంటలు మ్రోగుతూ సందడి చేస్తోంది.

పుంగనూరు మండలం పాడి ఆవులకు ప్రసిద్దిగాంచినది. అనేక సంవత్సరాల నుంచి పాడి ఆవులు వ్యవసాయంకోసం ఎద్దులు కోసం రాష్ట్రం నుంచే కాకుండ ఇతర రాష్ట్రాల నుంచి రైతులు కొనుగోలు చేసేందుకు పుంగనూరుకు వస్తుంటారు. అందుచేతనే పుంగనూరులో ప్రతి మంగళ, బుధవారాలలో పశువుల సంత గొప్పగా జరుగుతోంది. అలాగే సంవత్సరంలో ఒక సారి నెల రోజుల పాటు పూర్వం నుంచి గొప్ప పశువుల సంత నేటికి నిర్వహిస్తున్నారు. ఈ సంతలో పశువులు కొనుగోలు, అమ్మకాలకు కర్నాటక , తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వ్యాపారులు, రైతులు ఈ సంతలకు వస్తుంటారు. ఇప్పటికి పుంగనూరు ఎద్దల పరష అంటే ఓ ప్రత్యేకత సంతరించుకుంది.