Begin typing your search above and press return to search.

న‌టి లైంగిక వేధింపుల కేసులో 'మేడం'

By:  Tupaki Desk   |   23 Aug 2017 8:41 AM GMT
న‌టి లైంగిక వేధింపుల కేసులో మేడం
X
కారులో వెళుతున్న ఒక ప్ర‌ముఖ మ‌ల‌యాళ న‌టిని కిడ్నాప్ చేసి.. ఆమెను లైంగికంగా వేధించిన వైనం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఉదంతంలో ప్ర‌ముఖ హీరో దిలీప్ ను పోలీసులు అరెస్ట్ చేసి.. రిమాండ్‌ కు త‌ర‌లించ‌టం లాంటి ఎన్నో సంచ‌ల‌నాల‌కు కార‌ణ‌మైంది. అయితే.. ఈ వ్య‌వ‌హారం తాజాగా మ‌రో మ‌లుపు తీసుకొంటోంది. న‌టిని లైంగికంగా వేధింపుల‌కు గురి చేయ‌టం వెనుక ఒక మేడ‌మ్ హ‌స్తం ఉందని.. ఆమె నుంచి అందిన ఆదేశాల‌తోనే తాము ఈ ర‌కంగా చేసిన‌ట్లుగా ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడైన ప‌ల్స‌ర్ సునీ వెల్ల‌డించిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

తాను చెప్పే మేడం సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన వ్య‌క్తేన‌ని..ఈ కిరాత‌క నేరానికి పాల్ప‌డినందుకు అవ‌స‌ర‌మైన ధ‌న‌సాయాన్ని ఆమె చేశార‌ని పేర్కొన్నారు. మేడం చెప్పిన‌ట్లే న‌టిని లైంగికంగా వేధించ‌టంతో పాటు ఫోటోలు.. వీడియోలు తీసిన‌ట్లుగా చెబుతున్నాడు. అయితే.. నేరంలో స‌ద‌రు మేడం పాత్ర నేరుగా లేన‌ప్ప‌టికీ ధ‌న‌సాయం మాత్రం ఆమె చేశార‌ని పోలీసుల విచార‌ణ‌లో వెల్ల‌డించిన‌ట్లుగా తెలుస్తోంది.

ప‌ల్స‌ర్ సుని చెబుతున్న మేడం ఎవ‌రు? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. మ‌ల‌యాళ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో వినిపిస్తున్న వాద‌న‌ల ప్ర‌కారం హీరో దిలీప్ రెండో భార్య కావ్యా మాధ‌వ‌నే ఈ మేడం అయి ఉంటుంద‌ని చెబుతున్నారు. అన్ని వేళ్లు ఆమె వైపే చూపిస్తుండ‌టం గ‌మ‌నార్హం. ఇదిలా ఉంటే.. ప‌ల్స‌ర్ సుని ఎవ‌రో త‌న‌కు తెలీద‌ని ఆమె అంటున్నారు. త‌న‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల్ని ఆమె తీవ్రంగా కొట్టి పారేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. కావ్యా మాధ‌వ‌న్ మాట‌ల్ని తోసిపుచ్చుతున్న ప‌ల్స‌ర్ సునీ.. కావ్యాకు తాను ఎవ‌రో తెలీద‌న‌టం ప‌చ్చి అబ‌ద్ధ‌మ‌ని.. ఆమెకు తాను బాగా తెలుస‌ని చెప్పారు. వ్య‌క్తిగ‌త క‌క్ష తీర్చుకునేందుకే హీరో దిలీప్ న‌టిపై ఈ త‌ర‌హా దాడి చేశార‌న్న ఆరోప‌ణ బ‌లంగా వినిపించి.. ఆ కోణంలో విచారించిన పోలీసులు ఆయ‌న్ను అరెస్ట్ చేసిన వేళ‌.. ఇప్పుడు ఉన్న‌ట్లుండి మేడం మాట తెర మీద‌కు రావ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.