Begin typing your search above and press return to search.
దుర్గమ్మ ఆలయ పూజారి జ్యోతిషం నిజమైతే..!
By: Tupaki Desk | 26 March 2016 9:52 AM ISTఏప్రిల్ కూడా మొదలు కాకుండానే 40 ఢిగ్రీల ఉష్ణోగ్రతతో మండుతున్న ఎండలు.. ఏప్రిల్.. మే వస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుందన్నది ఆలోచించేందుకే భయపడుతున్నారు. మార్చి చివర్లోనే మండిపోతున్న ఎండలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఏపీ ప్రజలకు.. రానున్న రోజుల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయని విజయవాడలోని కనకదుర్గ ఆలయ ఆస్థాన జ్యోతిష్యుడు పూజ్యం విశ్వనాథ్ జోస్యం చెప్పారు. ఎండలు మండుతున్న మార్చికి భిన్నంగా.. ఏప్రిల్ 24 నుంచి ఏపీలో భారీ గాలులు.. భారీ వర్షాలు ఖాయంగా చెబుతున్నారు. తాజాగా కురిసే వర్షాలతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆయన భవిష్య వాణి చెప్పుకొచ్చారు.
ఏప్రిల్ మూడో వారం నుంచి మొదలయ్యే వర్షాలతో మరిన్ని కష్టాలు ఖాయమని చెబుతున్న ఆయన.. మరికొద్ది నెలల్లో జరిగే కృష్ణా పుష్కరాలు ప్రశాంత వాతావరణంలో జరుగుతాయని చెబుతున్నారు. ప్రకృతి విపత్తుల్ని పక్కన పెడితే.. రాష్ట్ర ప్రభుత్వానికి మంచిపేరు రావటం ఖాయమంటున్నారు. మరో నెలలో వచ్చి పడతాయని చెబుతున్న భారీ వర్షాల నష్టం ఎంత భారీగా ఉంటుందన్నది ఒక ప్రశ్న అయితే.. ఏప్రిల్ లో కురిసే భారీ వర్షాలతో వాతావరణం కూల్ కూల్ గా మారుతుందా? అన్నది మరో ప్రశ్న. వీటికి సమాధానాలు దొరకాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాలి.