Begin typing your search above and press return to search.

ఆసీస్ లో 'పుజారా'కి దెబ్బలు .. ఇంటికి రాగానే కూతురు ఆలా నయం చేసిందంట !

By:  Tupaki Desk   |   21 Jan 2021 10:40 AM GMT
ఆసీస్ లో పుజారాకి దెబ్బలు .. ఇంటికి రాగానే కూతురు ఆలా నయం చేసిందంట !
X
భారత్ నయావాల్ చతేశ్వర్ పుజారా... మరో రాహుల్ ద్రావిడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. టీం కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా జిడ్డు బ్యాటింగ్ చేసి గడ్డేకించాలో తెలిసిన క్రికెటర్. ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ వేదికగా జరిగిన ఆఖరి టెస్ట్‌ మ్యాచ్ లో పుజారా దాదాపు ఐదు గంటల పాటు క్రీజులో ఉండి , భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. పుజారాను ఆసీస్ బౌలర్లు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏ మాత్రం ఏకాగ్రత కోల్పోకుండా దృఢసంకల్పంతో నడిచాడు. 211 బంతులు ఆడి 52 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో 3 వికెట్లతో నెగ్గిన భారత్ 2-1తో సిరీస్ నెగ్గి చరిత్ర సృష్టించింది. ఇక ఇంటికి చేరుకున్న పుజారాకు ఘనస్వాగతం లభించింది.

ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.క్రికెట్ కోసం తాను ఎంతటి కష్టానైన్నా భరిస్తానని ,దెబ్బ తాకినప్పుడు పెయిన్ కిల్లర్స్ వేసుకోవడాని కన్నా నొప్పిని భరించడానికే తాను ఇష్టపడుతా అని అన్నాడు. అందుకే ఆసీస్ తో జరిగిన ఆఖరి టెస్టులో చాలా గాయాలైనప్పటికీ ఎక్కువ సేపు ఆడగలిగానని, ఆ గాయాలు మానడానికి తాను ఎలాంటి చికిత్స తీసుకుంటాడో కూడా తెలిపారు.

నాకు చిన్నప్పటి నుంచి దెబ్బ తగిలినప్పుడు పెయిన్ కిల్లర్స్ తీసుకునే అలవాటు లేదు. అందుకే ఎంతటి నొప్పినైనా భరించగలను. ఎక్కువ సేపు ఆడాల్సి వచ్చినప్పుడు గాయాలు తగిలే అవకాశముంటుంది. అందుకు సిద్ధపడే బ్యాటింగ్ చేస్తాను అని చెప్పాడు. కమిన్స్ బౌలింగ్‌లోనే ఎక్కువగా బంతులు నా శరీరానికి తాకాయి. బంతి టేకాఫ్ తీసుకునే చోట పిచ్‌పై పగుళ్లున్నాయి. దీన్ని సద్వినియోగం చేసుకోవడంలో కమిన్స్ దిట్ట.

అతనికి ఈ విషయంలో అపారమైన నైపుణ్యం ఉంది. ఆ బంతులను డిఫెండ్ చేయడానికి ప్రయత్నిస్తే గ్లోవ్స్‌ కు తాకి క్యాచ్ ఔటయ్యే ప్రమాదం ఉంది. మ్యాచ్ పరిస్థితి దృష్ట్యా మేం వికెట్లు కోల్పోకూడదు. దాంతో బంతిని నా శరీరానికి తాకించుకోవాలని నిర్ణయించుకున్నా అని తెలిపాడు. అయితే బంతి నా శరీరానికి చాలా సార్లు తాకినా.. చేతి వేలికి తాకినప్పుడు ప్రాణం పోయింది. చాలా నొప్పి కలిగింది. బ్యాటింగ్ కొనసాగించడానికి కష్టమైంది. బ్యాట్ పట్టుకోవడానికి కావాల్సిన గ్రిప్ పోయింది. చివరికి మేము గెలిచాము.

ఆ ఆనందంలో ఈ భాద కనిపించలేదు. ఇక ఒంటి నిండా గాయాలతో ఇంటికి రాగానే తన కూతురు ఇంటి చికిత్స చేసి నయం చేసిందని పుజారా తెలిపాడు. 'ఇంటికి రాగానే నా కూతురు దెబ్బ తగిలిన ప్రతి చోట ముద్దులు పెట్టింది. తనకు గాయమైనప్పుడల్లా.. ప్రేమతో దగ్గర తీసుకుని నేను ముద్దులు పెట్టేవాడిని. ఆ అలవాటే తనకు వచ్చింది. ముద్దు పెడితే గాయం మానుతుందని నా కూతురు నమ్ముతుంది అని పుజారా చెప్పుకొచ్చాడు.