Begin typing your search above and press return to search.
పెద్దపల్లి ఎమ్మెల్యే సోదరి కుటుంబం కేసులో మరో అనుమానం !
By: Tupaki Desk | 18 Feb 2020 7:50 PM ISTపెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరి రాధిక సహా ఆమె కుటుంబసభ్యులు సోమవారం నాడు కరీంనగర్ జిల్లా అలగనూర్ కాకతీయ కాల్వలో బయటపడిన కారులో విగతజీవులుగా కనిపించడం కలకలం రేగింది. గత నెల 27 నుంచి రాధిక కుటుంబం కనిపించడంలేదు. కారులో ఉన్న మూడు మృతదేహాలు ఎమ్మెల్యే చెల్లెలు రాధిక, ఆమె భర్త సత్యనారాయణ రెడ్డి, కూతురు సహస్రలుగా గుర్తించారు. సాధారణంగా ఒక ఇంట్లో ఉండే ఒక పిల్లాడు ఒక్క పూట కనిపించకపోతేనే.. వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేస్తుంటారు. అలాంటిది.. దాదాపు 25 రోజులుగా ఒక ఫ్యామిలీ కనిపించకుండా పోతే, అది కూడా ఒక ఎమ్మెల్యే చెల్లెలు.. కుటుంబంతో సహా అదృశ్యమైతే ఎవరికీ తెలియదా?
అయితే , ఈ కేసులో తాజాగా మరిన్ని అనుమానాలు మొదలయ్యాయి. గత నెల 28 నుండి రాధిక కుటుంబం ఫోన్లు స్విచ్చాఫ్ అయ్యాయని చెప్తున్నారు. ఇదే విషయాన్ని అదే రోజున ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి సమాచారం కూడా ఇచ్చినట్టు కూడా చెప్తున్నారు. ఎమ్మెల్యే బావ మరిదికి చెందిన ఫెర్టిలైజర్ షాపులో పనిచేసే నర్సింగ్ అనే వ్యక్తి 28నే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ఫోన్ లో సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం అందిన వెంటనే సోదరి ఇంటి తాళాలు పగలకొట్టి లోపలకు వెళ్లి వెతికారట ఎమ్మెల్యే.
ఆ తరువాత ఏమైందో ఏమో గానీ ఆ విషయాన్ని రహస్యంగా ఉంచి, 22 రోజుల పాటు కనీసం పోలీసులకి ఫిర్యాదు కూడా చెయ్యలేదు. దీనితో ఈ కేసులో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట స్థానికులు. తన సోదరి కుటుంబం తరుచూ విహార యాత్రలకు వెళ్తుందని, దానితో వారు క్షేమంగానే ఉన్నారని అనుకున్నామని ఎమ్మెల్యే చెబుతున్నారు. అలా అనుకున్నప్పుడు తాళాలు ఎందుకు పగలగొట్టారు. ఎందుకు 22 రోజుల పాటు వారి గురించి ఏ విషయం తెలియకపోయినా స్పందించలేదు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. వృత్తిరీత్యా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరి రాధిక ఉపాధ్యాయురాలు కాగా, ఆమె భర్త సత్యానారాయణ రెడ్డి ఫర్టిలైజర్ వ్యాపారం చేస్తున్నారు. ఒక అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే చెల్లెలు.. కుటుంబం తో సహా అదృశ్యమైతే ఎవరికీ పట్టలేదా? అనేది అతి పెద్ద అనుమానం.