Begin typing your search above and press return to search.

రిటైరయ్యేటపుడు రాజన్ స్ట్రాంగ్ వర్డ్స్

By:  Tupaki Desk   |   17 Aug 2016 5:17 AM GMT
రిటైరయ్యేటపుడు రాజన్ స్ట్రాంగ్ వర్డ్స్
X
మహా అయితే మరో 17 రోజులు ఆయన పదవిలో ఉంటారు. అలాంటి వేళ.. ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. పలు అంశాలకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించేలా ఉండటమే కాదు.. చర్చనీయాంశాలుగా మారాయి. ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులకు ఇస్తున్న జీతాల మీద రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పైస్థాయి ఉద్యోగులతో పోలిస్తే కిందిస్థాయి ఉద్యోగుల జీతాలు అధికంగా ఉన్నట్లుగా రాజన్ వ్యాఖ్యానించారు. రిటైర్మెంట్ల కారణంగా బ్యాంకుల్లోని మధ్యశ్రేణి ఉద్యోగాల్లో ఖాళీలు ఎక్కువగా ఉన్నాయని.. ఏయే విభాగాల్లో ఉద్యోగులు అవసరమన్న విషయాన్ని అంచనా వేయాల్సిన అవసరం ఉందన్నారు.

బ్యాంకులు రుణం మంజూరు చేసే విధానంలో మార్పు రావాలన్న రాజన్.. భారీ ప్రాజెక్టులకు ఇచ్చే రుణాల్లో రూల్స్ ను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పటం గమనార్హం. ఈ సందర్భంగా ఆయన చెప్పిన మాటల్లో ఒక కీలకాంశాన్ని ప్రస్తావించారు. కొందరు సీనియర్ బ్యాంకర్లు రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి సిఫార్సులు చేస్తుంటారని.. అలాంటి సిఫార్సులకు.. వారు చేసిన రుణాలకు బాధ్యత తీసుకోవాలన్న వాదనను వినిపించారు.

రుణ మంజూరు విషయంలో బ్యాంకులు మూర్ఖంగా వ్యవహరించొద్దన్న ఆయన.. రాబోయే రోజుల్లో దేశం ఆర్థికంగా మరిన్ని అవసరాలు కలిగి ఉంటుందని రాజన్ వ్యాఖ్యానించారు. బ్యాంకుల నిర్వహణ.. నిరర్థక ఆస్తుల మీద దృష్టి పెట్టాలన్న ఆయన.. భారీ ప్రాజెక్టులకు ఇచ్చే రుణాల రూల్స్ ను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బ్యాంకర్లు.. ఫిక్కీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సు రాజన్ ఈ ఆసక్తికర వ్యాఖ్యల్ని చేశారు.