Begin typing your search above and press return to search.

అక్కడ ఏడాదిలో 201 రోజులు సెలవులేనంట

By:  Tupaki Desk   |   7 Dec 2015 3:54 AM GMT
అక్కడ ఏడాదిలో 201 రోజులు సెలవులేనంట
X
ఏడాదిలో 365 రోజులకు 201 రోజులు అంటే.. సగానికి పైనే రోజులు సెలవులంట. నిజంగా అలా సెలవులు ఇచ్చే రాష్ట్రం ఉంటుందా? అన్న సందేహం అక్కర్లేదు. తాజాగా బీహార్ రాష్ట్ర సర్కారు విడుదల చేసిన 2016 సెలవుల పట్టిక చూస్తే.. షాక్ తినాల్సిందే.

అన్ని కులాల వారిని సంతృప్తి పరుస్తూ.. సెలవుల విషయంలో భారీ కసరత్తు చేశారంట. పండుగలతో పాటు.. పలు కులాలకు చెందిన నేతలకు సంబంధించి వివిధ కార్యక్రమాలతో పాటు.. పలు జాతీయ దినోత్సవాలకు కలిపి భారీగా సెలవులు ఇచ్చేస్తూనిర్ణయం తీసుకోవటం విస్మయాన్ని రేకెత్తిస్తోంది. తాజాగా రాష్ట్ర సర్కారు ఇచ్చిన సెలవుల లెక్క చూస్తే.. షాకింగ్ గా అనిపించక మానదు.

ఎందుకంటే.. ఏడాదిలో 201 రోజులు సెలవులే. ఉద్యోగులకు ఇచ్చే వారంతపు సెలవులతో కలిపి ప్రభుత్వం వివిధ సందర్భాల్లో ఇచ్చే సెలవుల్ని కలిపి లెక్కిస్తే.. మొత్తం 201 రోజులు సెలవులు వచ్చాయి. అంటే.. పని చేసే రోజుల కంటే సెలవులు తీసుకోవటమే ఎక్కువన్న మాట. రోజు పని చేస్తే రోజు సెలవు వచ్చే పరిస్థితి. దీంతో.. బీహార్ రాష్ట్రంలో స్టేట్ గవర్నమెంట్ జాబ్ వస్తే పండగేనని కొందరు సంబరపడిపోతుంటే.. ఇలా సెలవులు ఇచ్చుకుంటూ పోతే.. బీహార్ రాష్ట్ర అభివృద్ధి సంగతేమిటంటూ ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇంతకీ ఇన్ని సెలవులు ఇవ్వటమేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే.. అధికార పార్టీకి చెందిన నేతలు ఇచ్చే సమాధానం కాస్తంత ఆసక్తికరంగా అనిపించటం ఖాయం. వివిధ కులాలకు చెందిన నేతల్ని ఘనంగా సత్కరించటం.. వారికి గౌరవం ఇవ్వటం అన్నది ఎలా చేయాలన్న ఆలోచనకు సెలవుతో సమాధానం చెప్పాలని డిసైడ్ అయ్యారట. మిగిలిన వాటికి ఖర్చు ఎక్కువని.. అదే సెలవులు అయితే.. చేతిలోనే ఉంటాయి కదా అని చెప్పిన మాట విని విస్తుపోతున్నారట. ఏమాటకు ఆ మాటే.. బీహార్.. బీహారే సుమా.