Begin typing your search above and press return to search.

నిషేధించినా నీడలా వెంటాడుతోంది.. ప్రాణాలు తీస్తున్న పబ్​జీ

By:  Tupaki Desk   |   12 Oct 2020 4:00 PM IST
నిషేధించినా నీడలా వెంటాడుతోంది.. ప్రాణాలు తీస్తున్న పబ్​జీ
X
ఆన్​లైన్​ గేమ్​ పబ్​ జీ ని మనదేశంలో నిషేధించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఈ గేమ్​ యువతను నీడలా వెంటాడుతూనే ఉంది. పలు ఇతర సర్వర్ల ద్వారా యువత దొంగచాటుగా ఈ గేమ్​ను డౌన్​లోడ్​ చేసుకుంటాన్నారు. తాజాగా తిరుపతికి చెందిన ఓ యువకుడు పబ్​ జీ గేమ్​కు బానిసై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ గేమ్​ ముఖ్యంగా ‘పబ్‌ జీ’ యువతను చెడగొడుతోంది. వారి జీవితాలను నాశనం చేస్తోంది. చివరకు ప్రాణాలను తీసుకొనేలా ప్రేరేపిస్తున్నది.

తిరుపతిలోని నవాబ్‌పేటలో నివాసం ఉంటున్న యువకుడు పబ్జీకి బానిసయ్యాడు. కరోనా ఎఫెక్ట్​తో తండ్రి ఉపాధి కోల్పోయాడు. దీంతో ఎదన్నా పనిచేయాలని కుటుంబసభ్యులు యువకుడిపై ఒత్తిడి చేశారు. పబ్​ జీకి దూరమవుతానేమోనన్న బెంగతో ఈ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. పబ్​ జీ గేమ్​ నిజానికి దక్షిణ కొరియాకు చెందిన వీడియో గేమ్​. గూగుల్​ ప్లేస్టోర్ ​లో ఈ గేమ్​ అందుబాటులో ఉంటుంది. ఈ గేమ్ ​ను లక్షల మంది డౌన్ ​లోడ్​ చేసుకున్నారు. అయితే జాయిన్​ అయ్యేవాళ్లు మాత్రం 100 మందితో ఓ గ్రూప్​ ను ఏర్పాటు చేసుకోవాలి.. లేదా గ్రూప్​ లో జాయిన అవ్వాలి. ఇలా గ్రూప్​ లోకి జాయిన్​ అయ్యాక.. మన గ్రూప్​ లో 100 మంది తప్ప మిగతా వారంతా శత్రువులే. వారిని చంపుకుంటూ వెళ్లడమే ఈ గేమ్​. ఈ గేమ్‌ ఒక యుద్ధక్షేత్రాన్ని తలపిస్తుంది.

ఆటగాడు చనిపోతే గేమ్‌ అయిపోనట్లే లెక్క. యుద్ధంలో ఉపయోగించే తుపాకులు, బాంబులతో పాటు శత్రువులకు చిక్కకుండా దాక్కునేందుకు బంకర్లు, గాయపడితే వైద్యం పొందేందుకు మెడికల్‌ కిట్‌ వంటివి ఇందులో ఉంటాయి. అందుకే ఎలాగైనా గెలవాలనే కసితో ఈ ఆటలో చనిపోయిన ప్రతిసారీ తిరిగి గేమ్‌ లో ప్రవేశించాలనుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా పబ్‌ జీ ఆడేవాళ్లు సుమారు 20కోట్ల మంది వరకు ఉన్నట్లు అంచనా. దీనికి అలవాటు పడిన వారు చదువులో పూర్తిగా వెనుకబడుతున్నారని, నిద్రలేమి, కంటి సమస్యలతో బాధ పడుతున్నారని వైద్యులు వెల్లడిస్తున్నారు.