Begin typing your search above and press return to search.
పబ్జీ మరో వికృత చర్య.. తుపాకులతో దాడులు.. ఐదుగురు ఆస్పత్రిపాలు
By: Tupaki Desk | 25 Aug 2020 12:45 PM ISTదేశంలో పబ్జీ గేమ్ ఆడటం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి ఎన్ని అనర్థాలు జరిగాయో లెక్కే లేదు. ఆ గేమ్ ఒక వ్యసనంగా మారి ఎంతోమంది ఇప్పటికే ప్రాణాలు తీసుకున్నారు. ప్రాణాలు తీశారు కూడా. పబ్జీలో టాస్కులు ఛేదించే క్రమంలో ఎత్తైన బిల్డింగ్ మీద నుంచి కిందకు దూకడం, ఉరేసుకుని చనిపోవడం, కత్తితో వళ్ళంతా పొడుచు కోవడం, ఎదుటి వారిపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడడం పనులకు పాల్పడి ఎంతో మంది ప్రాణాలు తీసుకున్నారు. ఆ ఆటకు బానిసలై పిచ్చిగా ప్రవర్తించేవారు చాలా మంది ఉన్నారు. పబ్జీ గేమ్ ఆడుతూ ఎంతోమంది బలవుతున్న డంతో దీనిని నిషేధించాలని ప్రజలు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.
చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ గేమ్ ఆడటాన్ని నిషేధించాయి. అయితే ఆ గేమ్ ఆడటం పలువురికి వ్యసనంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా వారు ఈ గేమ్ కు బానిసలుగా మారారు. కాగా తాజాగా పబ్జీ కారణంగా ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగి.. అది ఇరు కుటుంబాల గొడవగా మారి కట్టెలు, తుపాకులతో ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు ఆసుపత్రి పాలవగా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షమ్లీ జిల్లా హసన్ పూర్ గ్రామంలో అమన్, విశాల్ అనే ఇద్దరు వ్యక్తుల మధ్య పబ్జి కారణంగా గొడవ తలెత్తింది. ఈ గొడవలో ఇరు కుటుంబాల వారు కూడా ప్రవేశించడంతో ఆ గొడవ కాస్త ఘర్షణలకు దారితీసింది. ఇరువైపుల వారు కత్తులు, తుపాకులతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ హింసాకాండ లో ఇద్దరు మహిళలు సహా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకొని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఐదుగురిని ఆజ ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో మరోసారి ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.