Begin typing your search above and press return to search.

పబ్బు రేప్ సీన్ : పట్టు వదలని బీజేపీ

By:  Tupaki Desk   |   4 Jun 2022 5:24 AM GMT
పబ్బు రేప్ సీన్ : పట్టు వదలని బీజేపీ
X
తెలంగాణ హోం మంత్రి త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని బీజేపీ ప‌ట్టుబ‌డుతోంది. మాజీ జ‌ర్న‌లిస్టు, దుబ్బాక ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ కూడా త‌న పోరాటాన్ని ఉద్ధృతం చేసే క్ర‌మంలో ఉన్నారు. పొలిటిక‌ల్ మైలేజీ కోస‌మే ఇదంతా అని తెలంగాణ రాష్ట్ర స‌మితి నాయ‌కులు మండిప‌డినా కూడా వాస్త‌వాలు తేలేదాకా బీజేపీ మాత్రం వెన‌క్కు త‌గ్గ‌మ‌నే అంటోంది.

తెలంగాణ రాజ‌ధాని హైద్రాబాద్ అట్టుడికిపోయే వార్త ఒక‌టి నిన్న‌టి రాత్రి హైలెట్ అయింది. ఓ ప‌బ్ ప్రాంగ‌ణంలో గ్యాంగ్ రేప్ జ‌రిగింద‌ని, అందుకు హోంమంత్రి మ‌న‌వ‌డితో స‌హా ఇంకొంద‌రు కార‌కులు అని టీఆర్ఎస్ బ‌హిష్కృత నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునంద‌న్ ఆరోపిస్తూ మీడియాలో సంచ‌ల‌నం రేపారు. ఆయ‌న ఆరోప‌ణ‌ల‌కు అనుగుణంగా బీజేపీ కార్య‌క‌ర్త‌లు జూబ్లిహిల్స్ పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద హ‌ల్చ‌ల్ చేశారు.

ర‌ఘునంద‌న్ తెగువ చూపి త‌మ ద‌గ్గ‌ర ఆధారాలు కూడా ఉన్నాయ‌ని పోలీసులు వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. ఇక ఈ విష‌యం తెలుగు రాష్ట్రాల‌లో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న వ్య‌క్తుల‌కు రాత్రికి రాత్రే ఎలా క్లీన్ చిట్ ఇస్తార‌ని పేర్కొంటూ హోం మంత్రి మ‌న‌వ‌డిని ఉద్దేశించి ప‌లు మీడియాల్లో దుమారం రేగుతోంది.

ఇక ఎప్ప‌టి నుంచో బీజేపీతో క‌య్యానికి కాలుదువ్వుతున్న టీఆర్ఎస్ తాజా ఘ‌ట‌న‌తో ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిపోయింది. ఇదే సమ‌యంలో చాలా మంది పెద్ద మ‌నుషులు ఈ ఘ‌ట‌న‌లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు క‌నుక ఈ కేసును త్వ‌ర‌గానే క్లోజ్ చేసేస్తార‌ని సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు అంటున్నారు. దిశ నిందితుల మాదిరిగా 16 ఏళ్ల బాలిక‌ను గ్యాంగ్ రేప్ చేసిన వారిని ఎన్కౌంట‌ర్ చేస్తారా? అంటే వారికో న్యాయం వీరికో న్యాయం వ‌ర్తిస్తుందా ? అన్న డౌట్స్ కూడా వ‌స్తున్నాయి.

వాస్త‌వానికి కొన్ని ప‌త్రిక‌ల్లో నిందితుల పేర్లు కూడా రాయ‌డానికి ఇష్ట‌ప‌డని సంద‌ర్భంలో ర‌ఘునంద‌న్ పోరు ఏ విధంగా స‌క్సెస్ అవుతుంద‌ని.? ఇప్ప‌టికే డ్ర‌గ్ రాకెట్ పైనా, విమెన్ ట్రాఫికింగ్ పైనా, ప‌బ్ క‌ల్చ‌ర్ పైనా, ఇంకా కొన్ని అసాంఘిక శ‌క్తుల ఆగ‌డాల‌పైనా పోలీసుల చ‌ర్య‌లు ఏ మాత్రం స‌మ‌ర్థనీయ ధోర‌ణిలో లేవు అని తేలిపోయింది. అయినా ఈ కేసు పెద్ద‌వాళ్ల పిల్ల‌లకు సంబంధించింది. ర‌ఘు నంద‌న్ ఫైట్ చేసినా కూడా కొన్ని రోజులే ఈ హ‌డావుడి ఉంటుంది కానీ త‌రువాత నిజాలు వెల్ల‌డిలోకి రావు అని కొంద‌రు వాదిస్తున్నారు.

మొత్తం భాగ్య‌న‌గ‌రిలో ఉన్న ప‌బ్ ల‌న్నింటిపైనా రైడ్ చేసి, అవి నిర్వ‌హిస్త‌న్న ఇల్లీగ‌ల్ బిజినెస్ పై దృష్టి సారిస్తే ఎంతో కొంత సానుకూల ఫ‌లితం వ‌స్తుంద‌ని, ఈ కేసుపై ర‌ఘునంద‌న్ ఒక్క‌రే కాదు మిగ‌తా బీజేపీ నాయ‌కులూ నిన్న‌టి మాదిరిగానే పోరాటం చేస్తే, ఆ విధంగా కేంద్ర నిఘా సంస్థ‌ల‌తో స్వ‌తంత్ర ద‌ర్యాప్తు చేయిస్తే ర‌ఘునంద‌న్ గెలిచిన‌ట్లు!