Begin typing your search above and press return to search.
సైకో కిల్లర్.. భోజనానికి పిలిచి ఖతం చేస్తాడు.. 12 హత్యలు
By: Tupaki Desk | 4 Oct 2020 5:40 PM ISTఅతడో సైకోకిల్లర్.. పైగా స్వలింగసంపర్కుడు. మగాళ్లంటే విపరీతమైన మోజు.. అందమైన మగాళ్లతో పరిచయం పెంచుకొని వారితో స్నేహం చేసి భోజనానికి ఇంటికి పిలిచి మరీ దారుణంగా హత్య చేస్తుంటాడు. ఇంటికి పిలిచిన మగాళ్లపై లైంగికదాడి చేయడం.. ఆ తర్వాత వారిని హత్య చేసి ముక్కలుగా నరకడం అతడికి అలవాటు. ఇప్పటి వరకు 12 మంది అమాయకులను పొట్టనపెట్టుకున్నాడీ నీచుడు.
ఉత్తర లండన్‌కు చెందిన డెన్నిస్ నిల్సన్ స్వలింగసంపర్కుడు. 195 మెల్రోజ్ అవెన్యూలోని ఇంట్లో నివసించేవాడు. అందమైన మగవాళ్లతో స్నేహం చేయడం వారిని ఇంటికి పిలిపించి చంపేసి.. వాళ్ల శవాలతో లైంగిక వాంచలు తీర్చుకోవడం అతడికి అలవాటు. ఈ దుర్మార్గుడు 1978 నుంచి హత్యలు చేయడం ప్రారంభించాడు.
మెల్రోజ్ అవెన్యూలోనే 12 మంది పురుషులను హత్య చేశాడు. వారిని ముక్కలుగా నరికి వేర్వేరు ప్రాంతాల్లో పడేసేవాడు. శరీరాల్లోని అవయవాలను తీసేసి.. ఇంటి ప్రహారీ బయటకు విసిరేవాడు. వాటిలో కొన్ని శరీర భాగాలతో చలిమంట కాచుకొనేవాడు.
ఆ వాసన బయటకు రాకుండా పాత టైర్లను కాల్చేవాడు. మరికొన్ని శరీర భాగాలను తన బెడ్రూమ్‌లోని దాచుకొనేవాడు.
కొంతమంది తలలను వేడి నీళ్లలో వేసి ఉడకబెట్టేవాడు.
నిల్సన్ మొదటి బాధితుడు స్టెఫెన్ హామ్స్. 1978, డిసెంబరు 30న ఓ సంగీత కార్యక్రమంలో పాల్గొన్న అతడిని నిల్సన్ తన ఇంటికి ఆహ్వానించాడు. మద్యం మత్తులో ఉన్న అతడిని బకెట్ నీళ్లలో ముంచి హత్య చేశాడు.
డ్రైనేజీలో నీరు వెళ్లకపోవడంతో సాధారణ సమస్యగా భావించి నిల్సన్ ఫిబ్రవరి 8, 1983న ఇంటి యజమానికి లేఖ రాశాడు. ‘డ్రైనేజీ పైపుల్లో నీరు బ్లాకవుతుంది. ఇది నాకే కాకుండా నాతోపాటు అద్దెకు ఉంటున్నవారికి కూడా చాలా అసౌకర్యంగా ఉంది. కాబట్టి, వెంటనే మరమ్మతులు జరిపించండి’ అని లేఖ రాశాడు. దీంతో యజమాని మెయింటెనెన్స్ వర్కర్లను పంపి మరమ్మతులు జరుపుతుండగా శరీర భాగాల ముద్దలు, ఎముకలు కనిపించాయి. పోలీసులు అపార్టుమెంట్ మొత్తం గాలింపులు జరిపి.. చివరికి నిల్సన్ ఫ్లాట్ తలుపులు బద్దలకొట్టి చూశారు. ఆ ఫ్లాట్ కుళ్లు కంపు కొట్టడంతో ఆ హత్యలు చేసింది అతడేనని నిర్ధారించుకున్నారు.
అదే రోజు మాటువేసి నిల్సన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
అయితే నిల్సన్ సుమారు 12 నుంచి 15 హత్యలు చేసినప్పటికీ వాళ్ల వివరాలు తెలియరాలేదు.
ఈ నేరాలకు నిల్సన్‌కు 25 ఏళ్ల జైలు శిక్ష విధించారు. జైల్లోకి వెళ్లినా నిల్సన్ నేరాలు చేస్తూనే ఉన్నాడు. డిసెంబరు 1983లో నిల్సన్ ఓ ఖైదీపై రేజర్ బ్లేడుతో దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితుడికి 89 చోట్ల బలమైన గాయాలయ్యాయి. ఈ శిక్ష అనుభవిస్తూనే నిల్సన్ 2018, మే 12న చనిపోయాడు. అంతర్గత రక్తస్రావంతో అత్యంత దారుణమైన నొప్పిని అనుభవిస్తూ అతడు చనిపోవడం గమనార్హం. నిల్సన్ హత్యాకాండపై 1989లో ‘కోల్డ్ లైట్ ఆఫ్ డే’ అనే సినిమా కూడా విడుదలైంది.