Begin typing your search above and press return to search.

థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ : వైసీపీలో అపరిచితుడిగా బతికాను

By:  Tupaki Desk   |   24 Jun 2022 5:01 PM GMT
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ : వైసీపీలో అపరిచితుడిగా బతికాను
X
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటే టాలీవుడ్ కమెడియన్ పృధ్వీ ఠక్కున గుర్తుకు వస్తాడు. ఆయన మంచి టైమింగ్ ఉన్న నటుడు. అయితే ఆయన వైసీపీ ద్వారా రాజకీయాల్లోకి వెళ్ళి మొదట ఒక రేంజిలో వెలిగినా క్షణకాలంలోనే ఆ వైభోగం అంతా కరిగిపోయింది. అసలు సినీ ఇండస్ట్రీలోనూ ఒక దశలో ఏమీ కాకుండా పోయారు. వైసీపీని వదిలేసిన పృధ్వీ ఇపుడు తాను మారిన మనిషి అంటున్నారు.

ఆ పార్టీలో ఉన్నపుడు తనతో మాట్లాడించిన మాటలు అన్నీ కూడా కేవలం టంగ్ మహిమే అని అంటున్నారు. తాను అపరిచితుడిగా మారిపోయి ఎన్నో అనేశాను అని కూడా నొచ్చుకున్నారు.

ఓపేన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాం లో పృధ్వీ ఈ వారం చెబుతున్న ముచ్చట్ల మీద చిన్న ప్రోమో వదిలారు. అందులో పృద్వీ వైసీపీ గురించి చాలా సంచలన కామెంట్స్ చేసినట్లుగానే ఉంది.

తనను కావాలనే వైసీపీ నేతలు ట్రాప్ చేసి పక్కన పెట్టేసారని, అదే ప్రస్తుతం మంత్రిగా ఉనన్ ఒకాయన, గతంలో మంత్రిగా చేసిన మరోకాయన మహిళలతో అసభ్యంగా మాట్లాడిన క్లిప్పింగులు బయటకు వస్తే ఏం చేశారు అని ఆయన ప్రశ్నించడమూ ఈ ప్రోమోలో కనిపిస్తుంది. తాను సినీ ఇండస్ట్రీ పెద్దవాళ్ళను అందరినీ ఎన్నో మాటలు అనేశానని వారు లైట్ తీసుకోబట్టే ఈ రోజున భూమి మీద ఉన్నాను అని పృద్వీ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు.

అమరావతి రైతులను అనరాని మాటలను అన్నాను అని చెబుతూ వారికి చానల్ ముఖంగా క్షమాపణలు చెప్పారు. ఇక జనసేనలో తాను చేరుతున్నట్లుగా చెప్పేసిన పృధ్వీ చంద్రబాబు ఎక్కడ తానెక్కడ అని ఆయన్ని అనేక రకాలుగా మాట్లాడి తప్పు చేశాను అని కలత చెందారు.

మొత్తానికి చూస్తే థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ తన మనసుని పూర్తిగా విప్పేశారు. చెప్పాల్సింది చెప్పేశారు. ఈ ఆదివారం ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ లో ఆయన మాటల బాంబులే పేల్చనున్నారని తెలుస్తోంది. మరి దానికి వైసీపీ రెడీగా ఉండాల్సిందేనేమో.