Begin typing your search above and press return to search.

కుక్కని సన్మానించడం గర్వంగా ఉంది : ట్రంప్ !

By:  Tupaki Desk   |   26 Nov 2019 7:52 AM GMT
కుక్కని సన్మానించడం గర్వంగా ఉంది : ట్రంప్ !
X
ఇస్లామిక్‌ స్టేట్ ఉగ్రవాద సంస్థ అగ్ర నాయకుడు అబు బకర్‌ ఆల్‌ బగ్దాదీ చేసిన ఘోరాలు అన్ని ఇన్ని కావు. నరమేధమే లక్ష్యంగా పనిచేసిన ఐసిస్ అగ్ర నాయకుడిని గత కొన్ని రోజులముందు అమెరికా సైన్యం ఎంతో చాకచక్యంగా మట్టుబెట్టిన విషయం తెలిసిందే. పక్కా ప్రణాళికతో బగ్దాదీ స్థావరాన్ని ముట్టడించిన అమెరికా దళం .. తప్పించుకోవడానికి ఉన్న అన్ని దారులని మూసేయడంతో తనకి తానుగా బాంబు తో పేల్చుకొని చనిపోయాడు. ఈ రెస్క్యూ ఆపరేషన్ లో అమెరికా సైనికులతో పాటుగా ..ఒక కుక్క కూడా కీలక పాత్ర వహించింది.

అసలు ఒక రకంగా బగ్దాదీ కుక్క చావు చావడానికి కూడా కుక్కనే కారణం. సొరంగంలో దాక్కున్న బాగ్దాదీ ని కుక్క వెంబడించడం తో ఆ కుక్క నుండి ఇక తప్పించుకోలేనని నిర్ధారణకి వచ్చిన బాగ్దాదీ ఆ సొరంగంలోనే బాంబ్ పేల్చుకొని చనిపోయాడు. బాగ్దాదీ చావుకి కారణమైన ఆ కుక్క పేరు .. కోనన్. పారిపోతున్న ఉగ్రవాదులను వేటాడిన కోనన్, బాగ్దాదీ మరణానికి కారణమైంది. దీనితో కోనన్ ఒక్కసారిగా హీరోగా మారిపోయింది. ప్రపంచ దేశాలను గడగడలాడించిన బాగ్దాదీని అంతం చేసిన నువ్వు కుక్క కాదు హీరో అని పలుదేశాల అధినేతలు , ప్రజలు ఆ కొనన్ పై ప్రశంసలు కురిపించారు.

తాజాగా కోనన్ ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్మానించారు. వైట్ హౌస్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత రోజ్ గార్డెన్ వేడుకలో పాల్గొన్న అయన కోనన్ పై ప్రశంసల వర్షం కురిపించారు ట్రంప్. 'ఇది మెరుపు దాడి. అల్-బాగ్దాదీ చచ్చాడు. కోనన్ ను సన్మానించాము. పతకం ఇచ్చాము. కోనన్ చాలా ప్రత్యేకమైన కుక్క. సో బ్రిలియంట్, సో స్మార్ట్' అని ట్రంప్ ప్రశంసించారు. అలాగే ఈ కొనన్ కి నేను సన్మానం చేయడం గర్వంగా ఉంది అంటూ చెప్పారు. ఆ ఆపరేషన్ లో పాల్గొన్న కొనన్ కి కూడా కొన్ని గాయాలైయ్యాయి. రహస్య సొరంగంలో బాగ్దాదీ తనను తాను పేల్చేసుకోవడంతో , ఆ సమయంలో దగ్గర్లో ఉన్న కోనన్ గాయపడింది. కానీ , ఆ గాయాల నుండి కొనన్ చాలా త్వరగా కోలుకుంది. కోనన్ బెల్జియన్‌ మలినోయిస్‌ జాతికి చెందిన కుక్క.