Begin typing your search above and press return to search.
బీజేపీ లో సింధియా చేరికపై కొడుకు ఘాటు వ్యాఖ్యలు !
By: Tupaki Desk | 11 March 2020 12:00 PM ISTజ్యోతిరాదిత్య సింధియా ..ప్రస్తుతం ఈ పేరు దేశ రాజకీయాలలో మారుమోగిపోతుంది. 18 ఏళ్లుగా కాంగ్రెస్ సభ్యుడిగా ఉంటూ , కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు అందించిన సింధియా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బి చెప్పి ..కమలం గూటికి చేరిపోయారు. ఇక మంగళవారం తొలుత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమై, తర్వాత ప్రధాని మోడీతో సమావేశమైయ్యారు. ఆ చర్చల అనంతరం కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ పంపారు. ఇన్ని రోజులుగా ఒకే పార్టీలో ఉన్నానని, ప్రజాసేవ చేయాలి అంటే ముందుకు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని సింధియా లేఖలో తెలిపారు.
అయితే, ప్రస్తుత పరిస్థితిల్లో ఇంకా పార్టీలో కొనసాగితే దేశ, రాష్ట్ర ప్రజలకు సేవ చేయలేనని అనిపిస్తోంది కాబట్టి.. కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం మెరుగని భావిస్తున్నానని తెలిపారు. అలాగే ఇన్నాళ్లూ దేశానికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు సోనియాకు కృతజ్ఞతలు తెలిపారు. అయన రాజీనామాను సోనియా వెంటనే ఆమోదించినట్లు తెలుస్తుంది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లో కీలక నేతగా కొనసాగుతున్న సింధియా ఒక్కసారిగా పార్టీకి రాజీనామా చేయడం, అలాగే తన వర్గం ఎమ్మెల్యేలు అయిన 22 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీకి రాజీనామా చేయడంతో మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ ప్రభుత్వానికి త్వరలో కాలం చెల్లబోతుంది అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
ఇకపోతే, జ్యోతిరాదిత్య సింధియా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సింధియా కుమారుడు మహానార్యమన్ సింధియా హర్షం వ్యక్తం చేసాడు. తమ కుటుంబం ఎప్పుడూ అధికారం కోసం అర్రులు చాచలేదని.. ప్రజాసేవ చేయడమే తమకు ముఖ్యమని, నాన్న ఈ స్టాండ్ తీసుకోవడం ఎంతో గర్వంగా ఉంది. ఇందుకు ఎంతో ధైర్యం కావాలి. మా కుటుంబానికి అధికార దాహం లేదని చరిత్రే చెబుతోంది. భారత్, మధ్యప్రదేశ్‌లో ప్రభావవంతమైన మార్పు తీసుకువస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాం అని ట్వీట్ చేసాడు.
సింధియా కుమారుడు మహానార్యమన్ సింధియా కూడా అతి త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉందని, సన్నిహిత వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. పార్టీ ప్రచార కార్యక్రమాలకు తండ్రి జ్యోతిరాదిత్య తో కలిసి హాజరైన మహానార్యమన్ ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. ఇక సమకాలీన రాజకీయ అంశాలపై సోషల్ మీడియాలో స్పందించే మహానార్యమన్.. గతంలో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అనేక ట్వీట్లు చేశాడు. ఇప్పుడు తండ్రి అదే పార్టీలో చేరుతుంటే ..గర్వకారణం అని చెప్పడం గమనార్హం. అయితే , అధికార దాహం తమ కుటుంబానికి లేదు అని చెప్తున్నా కూడా ...అధికారం కోసమే సింధియా పార్టీ మారారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. గత కొన్నేళ్లుగా మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. అలాంటి పరిస్థితుల నుండి పార్టీ ని గట్టెక్కించిన సింధియా ని కాదని , అధికారంలోకి వచ్చిన తరువాత అధిష్టానం సీఎం పదవిని కమల్ నాధ్ కి ఇవ్వడం తో పార్టీ పై కొన్ని రోజులుగా అసంతృప్తితో ఉన్న సింధియా ఈ నిర్ణయం తీసుకున్నారు అని రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.