Begin typing your search above and press return to search.
‘లక్ష్మీవిలాస్ ’ బ్యాంకు విలీనంపై నిరసనలు.. ఎందుకంటే..
By: Tupaki Desk | 27 Nov 2020 8:00 PM ISTఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న‘లక్ష్మీ విలాస్ బ్యాంకు.’(ఎల్.వీ.బీ).. డీబీఎస్ బ్యాంకులో విలీనం అయింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై కేంద్రం ఆమోదముద్ర వేయడంతో డీబీఎస్ లో కలిసిపోయింది. వీలైనంత వరకు విలీన ప్రక్రియను పూర్తి చేస్తామని మొన్న కేంద్రమంత్రి జవదేకర్ తెలిపారు. అంతేకాకుండా తాము విత్ డ్రా చేసుకునే మనీపై ఎలాంటి ఆంక్షలు ఉండవని ప్రకటించడంతో ఖాతాదారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ విలీనంపై ఎల్ వీబీ ప్రమోటర్లు కోర్టుకెక్కారు. విలీనంపై స్టే విధించాలని బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
లక్ష్మీ విలాస్ బ్యాంకు కు సంబంధించిన రూ.318 కోట్ల విలువైన టైర్ 2 బాండ్స్ ను రైటాఫ్ చేసినట్లు ఎల్ వీబీ స్టాక్ ఎక్చేంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. అంటే విలీనానికి సంబంధించిన ఎల్ వీబీ పెడిడప్ షేర్ క్యాపిటల్ మొత్తం రైటాప్ చేస్తారు. దీంతో తమ పెట్టుబడిని కోల్పోతామని భావించిన ఇన్వెస్టర్లు కోర్టుకెక్కారు. ఇందులో భాగంగా ప్రమోటర్లకు 6.8 శాతం వాటా ఉండగా, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కు 4.99 శాతం వాటా ఉంది. దీంతో వారు బాంబే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కానీ పిటిషన్ ను కోర్టు గురువారం తిరస్కరించింది. ప్రమోటర్లే కాకుండా ఎల్ వీబీ విలీనాన్ని సవాల్ చేస్తూ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ వేసిన పిటిషన్ ను జస్టిస్ నితిన్ జమ్దార్, జస్టిస్ మిలింద్ లతో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. అనంతరం విలీనంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ సందర్భంగా డిసెంబర్ 14 లోపే పిటిషన్లు స్వీకరిస్తామని, ఆలోపు ఎల్ బీబీ, డీబీఎస్, ఆర్బీఐ లు అఫిడవిట్సన్ దాఖలు చేయాలని సూచించింది.
మరోవైపు లక్ష్మీ విలాస్ బ్యాంకు డీబీఎస్ లో విలీనంపై ఆందోళన రేకెత్తిస్తోంది. లక్ష్మీ విలాస్ బ్యాంకు సంక్షోభానికి కారణం ఆర్బీఐ నేనని, అందుకు సంబంధించిన వివరాలు బయటపెట్టాలని ఆల్ ఇండియా బ్యాంక్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. ఓ విదేశీ బ్యాంకు అయిన డీబీఎస్ ను ఇండియాలోకి తీసుకొచ్చేందుకే లక్ష్మీ విలాస్ బ్యాంకును విలీనం చేశారని ఆరోపిస్తున్నారు. లక్ష్మీ విలాస్ బ్యాంకు నుంచి కొంతమంది ప్రముఖులకు పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వడంతోనే నష్టాల్లో కూరుకుపోయిందటున్నారు.