Begin typing your search above and press return to search.

స్పెయిన్ లో విచిత్రం..మాస్కులు పెట్టుకోమంటూ నిరసన ప్రదర్శనలు

By:  Tupaki Desk   |   19 Aug 2020 12:30 AM GMT
స్పెయిన్ లో విచిత్రం..మాస్కులు పెట్టుకోమంటూ నిరసన ప్రదర్శనలు
X
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. కరోనా వ్యాప్తి అడ్డుకట్టకు ప్రభుత్వాలు లాక్ డౌన్ తో పాటు పలు నిబంధనలను అమలు చేస్తున్నాయి. ప్రజలను బయట తిరగకుండా పలు ఆంక్షలు విధిస్తున్నాయి. వాహనాల వినియోగంలో నిబంధనలు అమలు చేస్తున్నాయి. మాస్కు ధారణ అయితే ఇక తప్పనిసరి చేశాయి. కొన్ని దేశాల్లో మాస్కులు లేకుండా బయట కనిపిస్తే జరిమానా కూడా విధిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఇలా ఉంటే స్పెయిన్లో మాత్రం మరో రకంగా ఉంది. ఆ దేశంలో మాస్కు కచ్చితంగా పెట్టుకోవాలని, బహిరంగంగా సిగరెట్ తాగొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వ ఆదేశాలను ఆ దేశ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మాస్కులు ధరించాలని చెప్పడం తమ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని రోడ్లపైకి వేలాదిగా చేరుకుని నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. ప్లకార్డులు చేత పట్టుకుని మాస్కులు పెట్టుకోమంటూ నినాదాలు చేస్తున్నారు. పైగా గుంపులు గుంపులుగా చేరి ఆందోళన చేపడుతున్నారు. స్పెయిన్ లో నెలకొన్న విచిత్ర పరిస్థితిపై అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇదేం పద్ధతి అని విమర్శిస్తున్నారు. మాస్కు ధరించకపోతే కరోనా ఎలా తగ్గుతుందని అంటున్నారు. ప్రజలకు స్వేచ్ఛ ఉండొచ్చుగానీ మరీ ఇంత ఉండకూడదంటున్నారు. స్పెయిన్లో ఇప్పటివరకు 3.82 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. 28, 646 మంది మృతి చెందారు.