Begin typing your search above and press return to search.

రష్యాలో ఉక్రెయిన్ కు అనుకూల నిరసనలు.. పుతిన్ వార్నింగ్

By:  Tupaki Desk   |   17 March 2022 11:30 PM GMT
రష్యాలో ఉక్రెయిన్ కు అనుకూల నిరసనలు.. పుతిన్ వార్నింగ్
X
ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ దేశంలోని ప్రధాన నగరాల్లో బాంబు, క్షిపణి దాడుల మరింత ఎక్కువ అయ్యాయి. కాల్పుల మోతతో అనేక ఉక్రెయిన్ నగర వీధులు దద్ధరిల్లుతున్నాయి. ఇప్పటికే లక్షల సంఖ్యలో ఉక్రెయిన్లు ఇతర దేశాలకు తరలి వెళ్లారు. అంతే కాకుండా ఈ పోరాటంలో వేల సంఖ్యలో పౌరులు మృత్యువాత పడ్డారు. పౌరులపై దాడులు జరిపేది లేదు అని ఓ పక్క చెప్తూనే రష్యా సేనలు పౌరులే లక్ష్యంగా చాలా ప్రాంతాల్లో బాంబులతో విరుచుకుపడుతున్నారు.

అధ్యక్షుడు పుతిన్ కూడా బయటకు ఉక్రెయిన్ ను ఆక్రమించుకోవడం తమ లక్ష్యం కాదని చెబుతున్నారు. కానీ చాలా వరకు నగరాల్లో పౌరులు పుతిన్ సేనల కాల్పుల్లో చనిపోతున్నారు. చాలా నగరాలు మృతదేహాలతో శవాల దిబ్బలు గా మారుతున్నాయి. కానీ ఉక్రెయిన్ ఎక్కడ రష్యా పై పోరాటం లో ఎక్కడ తగ్గకుండా ధీటైన సమాధానం ఇస్తుంది. ఈ క్రమంలో ఇరు దేశాలకు చెందిన సైనికులు చనిపోతున్నారు. ఇలా చనిపోయిన వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో కూడా తాము చేసే దాడులు రష్యా పూర్తిగా సమర్థించుకుంటోంది.

ఇవన్నీ చూస్తున్న పశ్చిమ దేశాలు రష్యా చేపట్టిన సైనిక చర్య ను అడ్డుకునేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ ఫలితం మాత్రం శూన్యం గా ఉంది. పట్టుదలతో పుతిన్ వెనక్కి తగ్గడం లేదు. దీంతో అమెరికా సహా నాటో దేశాలు అన్నీ కూడా రష్యా, దాని సంబంధీకులు, వ్యాపార వేత్తలపై ఆంక్షలు విధించాయి.

ఇలా చేసినా కానీ భయపడేది లేదు అని పుతిన్ తేల్చిచెప్పాడు. అంతే కాకుండా ప్రస్తుతం అగ్ర దేశాలుగా ఉన్నటువంటి దేశాలకు అమెరికా, బ్రిటన్ ఇతర నాటో దేశాలకు వార్నింగ్ కూడా ఇచ్చారు. మీరు ఆంక్షలు విధిస్తే అది మీకే ఇబ్బంది అని అన్నారు. ఇలా తన స్వభావాన్ని మార్చుకోలేదు. అంతేగాకుండా ఉక్రెయిన్ పై కాల్పులను మరింత ఎక్కువ చేసింది. అక్కడ ఉన్న ప్రజల పై కూడా విపరీతమైన దాడులు జరిపింది.

దీంతో ఉక్రెయిన్ అంతర్జాతీయ న్యాయ స్థానం మెట్లు ఎక్కింది. ఈ న్యాయస్థానంలో వాదనలు విన్న ధర్మాసనం రష్యా కచ్చితంగా దాడులను ఆపాలని ఆదేశించింది. పౌరులపై కాల్పులు జరపలేదని రష్యా చెప్పుకు వచ్చిన వాదనను కొటట్ వేసింది. అంతేకాకుండా ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం అనేది రష్యాన్ లకు కూడా నచ్చడం లేదు.

ఇందుకు ఆ దేశంలోని ఓ వార్తా సంస్థ యాంకర్ పుతిన్ చర్యను తప్పు పట్టింది. ప్రజల అసంతృప్తి ని బాహాటంగానే లైవ్ గానే చెప్పింది. దీనికి ఆమెను జైలులో బంధించారు. తరువాత విడుదల చేసాడు. మరో వైపు ఉక్రెయిన్ కు మద్దతుగా రోడ్లపైకి వస్తున్న వారిపై పుతిన్ ఆగ్రహంతో ఉన్నారు. వారిపై చర్యలు చేపట్టేందుకు సిద్దం అవుతున్నారు.

ఓ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. అగ్రరాజ్యం అమెరికా పై మండిపడ్డారు. అమెరికా తో పాటు ఇతర నాటో దేశాలు అన్ని కలిసి రష్యాను సమూలంగా నాశనం చేయాలని భావిస్తున్నాయని పేర్కొన్నారు. అంతే గాకుండా వారు తగిన బుద్ధి చెప్తామని కూడా అన్నారు. దేశంలో ఉక్రెయిన్ కు అనుకూలంగా రోడ్లపైకి వస్తున్న వారిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. రష్యా కు అసలైన దేశద్రోహులు ఎవరో తమకు తెలుసు అని అన్నారు. సమయం వచ్చినప్పుడు వారిపై కూడా కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.