Begin typing your search above and press return to search.

సీఎం ఇంటికే నిప్పు పెట్టేశారు

By:  Tupaki Desk   |   3 Feb 2017 5:31 AM GMT
సీఎం ఇంటికే నిప్పు పెట్టేశారు
X
ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్‌ లో తీవ్ర‌ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ రాష్ట్రంలో జ‌ర‌గాల్సిన పుర‌పాల‌క ఎన్నికల్లో త‌మ డిమాండ్ కు ప్ర‌భుత్వం ఆమోదముద్ర వేయ‌క‌పోవ‌డంతో ఆందోళ‌న‌కారులు ఏకంగా సీఎం ఇంటికే నిప్పుపెట్టారు. మున్సిప‌ల్ ఎన్నిక‌లు వాయిదా వేయాలని కొద్దికాలంగా ప‌లువురు డిమాండ్ చేస్తున్నారు. అయితే వారి ప్ర‌తిపాద‌న‌కు ప్రభుత్వం ఒప్పుకోక‌పోవ‌డంతో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

ఎన్నిక‌లు వాయిదా వేయాల‌ని కోరుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేప‌ట్టిన నిర‌స‌న‌కారులు ఈ క్ర‌మంలో త‌మ ఆగ్రహాన్ని తారాస్థాయికి తీసుకువెళ్లి డిమపుర్ లోని సీఎం జిలియంగ్ నివాసంతోపాటూ కొహిమ మున్సిపల్ కౌన్సిల్ బిల్డింగ్ కు నిప్పుపెట్టారు. ఆందోళనకారుల ఆగ్ర‌హానికి ఆ భ‌వాన‌లు దగ్దం అయిపోతున్నాయి. ఈ విష‌యం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకొని మంట‌ల‌ను ఆర్పుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు అందిన‌ స‌మాచారం ప్ర‌కారం ప్రాణ‌న‌ష్టం సంబ‌వించ‌లేదు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/