Begin typing your search above and press return to search.

ప్రధాని మోడీకి ఘోర అవమానాన్ని మిగిల్చిన పంజాబ్ నిరసనకారులు

By:  Tupaki Desk   |   5 Jan 2022 6:07 PM IST
ప్రధాని మోడీకి ఘోర అవమానాన్ని మిగిల్చిన పంజాబ్ నిరసనకారులు
X
ప్రధాని నరేంద్రమోడీకి పంజాబ్ లో ఘోర అవమానం ఎదురైంది. అయిదు రాష్ట్రాల ఎన్నికల ప్రచార జోష్ లో ఉన్న మోడీకి పంజాబ్ లోని నిరసనకారులు గట్టి షాక్ ఇచ్చారు. ఈరోజు పంజాబ్ పర్యటనలో ఉన్న మోడీకి చేదు అనుభవం ఎదురైంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పంజాబ్ లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలోనే అక్కడ పాగా వేయాలని బీజేపీ యోచిస్తోంది.

ఈ క్రమంలోనే పంజాబ్ పర్యటనకు మోడీ వచ్చాడు. దాదాపు 42750 కోట్ల రూపాయల విలువ చేసే పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు మోడీ చేయాల్సి ఉంది.

ఢిల్లీ-అమృత్ సార్-కాట్రా ఎక్స్ ప్రెస్, అమృత్ సర్-ఉనా రహదారి విస్తరణ, ముకేరియన్ -తల్వారా కొత్త బ్రాడ్ గేజ్ రైల్వే పనులను మోడీ ప్రారంభించాల్సి ఉంది. దీనికోసం మోడీ పంజాబ్ కు మధ్యాహ్నం చేరుకున్నారు. అయితే మోడీకి సరైన భద్రత కల్పించకుండా పంజాబ్ ప్రభుత్వం షాకిచ్చింది. మోడీ ప్రయాణిస్తున్న కాన్వాయ్ ఫ్లై ఓవర్ మీదకు చేరుకోగానే కొందరు నిరసనకారులు రహదారిపైకి వచ్చి ఆందోళన చేశారు. దీంతో 20 నిమిషాల పాటు ప్రధాని ట్రాఫిక్ లో ఇరుక్కోవాల్సి వచ్చింది. ఫ్లైఓవర్ పై మోడీ ఎటూ కదల్లేని స్థితిని ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ క్లియర్ చేసేంత వరకూ కారులోనే ఉండిపోయారు.

పంజాబ్ లోని రైతులు, నిరసనకారులు ధర్నా నిరసన చేయడంతోనే మోడీ ఇలా ఫ్లైఓవర్ పై చిక్కుకుపోయారని తెలిసింది. వారిని నియంత్రించడంలో పంజాయ్ కాంగ్రెస్ సర్కార్ ఫెయిలైంది. కావాలనే మోడీకి కాంగ్రెస్ సర్కార్ షాకిచ్చిందా? అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ ఘటనపై మోడీ సీరియస్ అయ్యారు. తాను ప్రాణాలతో తిరిగి వెళుతున్నానని.. మీ ముఖ్యమంత్రికి థ్యాంక్స్చెప్పండని.. ఈ విషయాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ కు తెలియజేయాలని ఢిల్లీ వెళ్లే ముందుకు ఎయిర్ పోర్టు అధికారులతో మోడీ చెప్పారు.

కాగా మోడీ హెలిక్యాప్టర్ లో రావాల్సి ఉందని.. ఆయన పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశామని.. కానీ చివరి నిమిషంలో కాన్వాయ్ పై రావడంతోనే ఫ్లై ఓవర్ పై ట్రాపిక్ లో చిక్కుకుపోయాడని.. ఇందులో భద్రతా వైఫల్యం లేదని పంజాబ్ సీఎం చరణ్ జిత్ క్లారిటీ ఇచ్చారు. ఇక మోడీని 20 నిమిషాల పాటు ట్రాఫిక్ లో చిక్కుబడేలా చేసిన పంజాబ్ సర్కార్ పై , నిరసనకారులపై బీజేపీ నేతలు భగ్గుమన్నారు. జేపీ నడ్డా, అమిత్ షా సహా నేతలంతా ఫైర్ అయ్యారు.