Begin typing your search above and press return to search.
వైసీపీ నుంచే నిరసన...ఈ వ్యతిరేకతను గమనిస్తున్నారా...?
By: Tupaki Desk | 31 Dec 2021 7:00 AM ISTఅధికారంలో ఉన్న పార్టీకి ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. ఎంత అనుభవం ఉండి నిబ్బరంగా రాజకీయ కధ నడిపే వారే ఎక్కడో ఒక చోట తడబాటు పడే సీన్ ఉంటుంది. ఇక పార్టీని ప్రభుత్వాన్ని అంతా తానై నడిపిస్తున్న వైఎస్ జగన్ కి తమ ప్రభుత్వం గురించి జనాలు ఏమనుకుంటున్నారో ఫీడ్ బ్యాక్ ఏ రూపాన అయినా అందుతోందా అన్నదే చర్చగా ఉంది. జగన్ తాడేపల్లిలో డైలీ అధికారులతో సమీక్షలు చేస్తూ గడుపుతున్నారు. అలాగే ఆయన సంక్షేమ పధకాలు ఎలాగోలా పంటిబిగువున అమలు చేయడానికే అత్యధిక ప్రాధ్యాన్యత ఇస్తున్నారు. అయితే క్షేత్ర స్థాయిలో అటు సర్కార్, ఇటు పార్టీ సీన్ ఎలా ఉందో ఆయనకు తెలుస్తోందా అన్నదే పార్టీలో మాట.
నిజానికి వైసీపీని విమర్శించాల్సిన పని, రాజకీయ అవసరం ప్రతిపక్ష టీడీపీకి ఎక్కువగా ఉంటుంది. మిగిలిన పార్టీలు కూడా ప్రభుత్వ విధానాలను వీలు దొరికితే చాలు తూర్పారా పడతాయి. అయితే అది నాచురల్ అని ప్రభుత్వ వర్గాలు కొట్టిపారేస్తాయి. కానీ తమ పార్టీకే చెందిన వారు, తమ గుర్తు మీదనే నెగ్గిన వారు కూడా విమర్శలు చేస్తూంటే చెవి పెట్టి వినాలి కదా. అసలు తమ పార్టీ వారే బజారున ఎందుకు పడుతున్నారు అన్నది కూడా ఆలోచించాలి కదా. నిజంగా అది సంచలనం కదా.
తాజాగా జరిగిన కర్నూల్ కార్పోరేషన్ సమావేశంలో ఏకంగా వైసీపీకే చెందిన 43వ వార్డు కార్పోరేటర్ మునెమ్మ తమ వార్డులో అభివృద్ధి పనులే అసలు జరగడంలేదని ఆరోపిస్తూ కౌన్సిల్ హాల్ లోనే బైఠాయించేశారు. ఎక్కడ చూసినా జనాలు తనను నిలదీస్తున్నారని, దాంతో తాను బయట తిరగలేకున్నాను అని ఆమె సొంత ప్రభుత్వం మీదనే విమర్శలు చేయడం ఇక్కడ గమనార్హం. ఆమె తమ పార్టీకే చెందిన మేయర్ ని, పార్టీ నేతలను నిలదీయడంతో అది సంచలనం అయింది.
ఆమె ఒక్కరే కాదు, అదే సమావేశంలో పాల్గొన్న 41వ వార్డు కార్పోరేటర్ శ్వేత సైతం తమ వార్డులో చిన్న పనులు కూడా చేసుకోలేని దుస్థితి దాపురించింది అంటున్నారు. వారిని ఈ ఏడాది జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రజలు మంచి మెజారిటీతో ఎన్నుకున్నారు. కనీసం వార్డులో అయినా అభివృద్ధి పనులు చేస్తారని పట్టం కట్టారు. మరి జనాల సెగ ఎక్కడో సచివాలయాలలో ఉండే మంత్రులకు, ప్రభుత్వ పెద్దలకు నేరుగా తాకకపోవచ్చు, కానీ నిత్యం జనాల్లో ఉండే వారికే గట్టిగా తగులుతుంది. అందుకే వారు జనం నుంచి వచ్చే విమర్శలు తట్టుకోలేక ఏకంగా కౌన్సిల్ మీటింగులోనే గద్దించారు.
అవును పేరుకే నగరాలూ, పట్టణాలు అని చెప్పాలి. అక్కడ రోడ్లు చూస్తే ఎక్కడికక్కడ కొట్టుకుపోయి ఉన్నాయి. వార్డులలో కనీసంగా ఒక ప్రగతి పని చేయాలన్నా పైసా ప్రభుత్వం నుంచి రాలని పరిస్థితి ఉంది. దాంతో తాము ఏదో గెలిచాము అన్న సంతోషం తప్ప కార్పోరేటర్లు అయినా మేయర్లు అయినా ఉత్సవ విగ్రహాల మాదిరిగానే ఉండాల్సి వస్తోంది. మరి ఆవేదనను మునెమ్మ, శ్వేత లాంటి వైసీపీ కార్పొరేటర్లు గట్టిగానే వినిపిస్తున్నారు.
ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇంకా మరిన్ని చోట్ల వైసీపీ నేతలు కౌన్సిల్ మీటింగ్స్ పెడితే ఇదే ఆవేదన మిగిలిన వారూ వినిపించవచ్చు. అది రాజకీయ రచ్చగా మారి వైసీపీకి మొత్తం చుట్టేయవచ్చు. అంతవరకూ పరిస్థితి రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కదా. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అంటే సంక్షేమ కార్యక్రమాలను బాగానే వేస్తున్నారు కదా అన్న జవాబు జనాలే చెబుతారు. ఇక వారి దగ్గర ఇలాంటి ఓర్చుకోవడాలకు అసలు తావు లేదు. అందుకే ఆర్ధిక పరిస్థితి, ఏపీ ఎకనామిక్స్, కరోనా కష్టాలు ఏకరవు పెడుతూంటే జనాలే కాదు, ఆఖరుకు సొంత పార్టీ వారూ నమ్మరు, వ్యతిరేకిస్తారు. అందుకే క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పరిస్థితులను కూడా కంట కనిపెట్టాలి. అదే విధంగా సమయం ఉంది కాబట్టి ఇపుడే సెట్ చేసుకోవాలి. అవును కానీ ఇంతకీ గ్రాస్ రూట్ లెవెల్ లో సర్కార్ మీద వస్తున్న వ్యతిరేకత జగన్ కి అయినా తెలుసునా, ఈ నిరసన ధ్వనులు ఆయన చెవిన పడుతున్నాయా.