Begin typing your search above and press return to search.

అమీర్ పేటలో సెక్స్ రాకెట్ - విటుడెవరో తెలుసా?

By:  Tupaki Desk   |   28 May 2020 9:00 AM IST
అమీర్ పేటలో సెక్స్ రాకెట్ - విటుడెవరో తెలుసా?
X
ప్రధాన మంత్రి నుంచి పంచాయతీ సర్పంచ్ వరకు భౌతిక దూరం పాటించమని మొత్తుకుంటున్నారు. జనం కూడా చాలా మంది పరిచయం లేని వారికి షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే భయపడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో వ్యభిచారం పూర్తిగా జీరోకు వచ్చిందని పాపం అమాయకులు లెక్కలేసుకున్నారు. కానీ ఈ టైంలోను తమ పని తాము కానిచ్చేస్తున్నాయి కొన్ని ట్రూపులు.

ఒకప్పుడు కామాతురానాం నభయం, నలజ్జ అనేవారు. ఇపుడు ‘కామాతురానాం నభయం, నలజ్జ, నకరోనా‘ అని అనాల్సి వస్తోంది. తెలిసిన వారికి కూడా చెయ్యివ్వడానికి భయపడి చస్తుంటే కామాసురులు వేశ్యల వద్దకు వెళ్తున్నారు. ఎంతో చదువుకున్న వారు, ఉన్నత పదవుల్లో ఉన్నవారు కూడా ఈ చర్యలకు పాల్పడుతుంటం విస్మయాన్ని కలిగిస్తోంది. ఇటీవలే పలు నగరాల్లో వ్యభిచార గృహాలపై పలు దాడులు జరిగాయి. కూకట్ పల్లి, వనస్థలిపురం, కాకినాడ తదితర ప్రదేశాల్లో వ్యభిచార గృహాలను గుర్తించి పోలీసులు దాడులు చేశారు.

తాజాగా హైదరాబాదు నడిబొడ్డున అమీర్ పేటలో ఓ వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు చేయగా... ఆదాయపు పన్ను ఉన్నతాధికారి పట్టుబడ్డారు. నిర్వహకుడు తప్పించుకోగా విటుడిగా వెళ్లిన ఆదాయపు పన్ను అధికారి నాగేంద్ర భూక్యాను పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు యువతులను పోలీసులు వారి చెర నుంచి విడిపించారు. నాగేంద్ర భూక్యా ముంబైలోని ఆదాయపు పన్ను ఆఫీసులో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తున్నట్లు ఎస్సార్ నగర్ పోలీసులు తెలిపారు.