తిరుపతిలో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టురట్టు ..అంతా వాట్సాప్ లోనే !

Wed Jul 21 2021 14:46:01 GMT+0530 (IST)

prostitution gang conspiracy in Tirupati

సులభంగా డబ్బు సంపాదించేందుకు హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టుని పోలీసులు రట్టు చేశారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. తిరుపతిలో కొందరు హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. వాట్సాప్ లోనే యువతుల ఫోటోలను షేర్ చేసి మరీ విఠులను ఆకర్షించడం గమనార్హం. వాటిని చూసి ఫోన్ ద్వారా సంప్రదించిన వారికి యువతుల ఫొటోలు మొత్తం బ్యాంక్ ఖాతా నంబర్ పంపిస్తారు.  డబ్బు ఖాతాలోకి రాగానే ఎంపిక చేసుకున్న లాడ్జీలకు రమ్మని విటులకు చెబుతున్నారు. అలా కాదనుకుంటే ఆ యువతలను వారు చెప్పిన చోటికి వారి సిబ్బంది ద్వారా  పంపిస్తున్నారు. అదేవిధంగా లాడ్జీలో గదులు తీసుకున్న వారు అమ్మాయిలను కావాలని అడిగితే నిర్వాహకులతో లావాదేవీలు జరిపి సరఫరా చేస్తున్నారు.వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా తిరుపతిలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలోని ఎస్‌బీఐ కాలనీలో రహస్యంగా కొనసాగతున్న హైటెక్ వ్యభిచార ముఠా గుట్టును ఈస్ట్ పోలీసులు రట్టు చేశారు.  వాట్సప్ ద్వారా యువతుల ఫొటోలను విటులకు నిర్వాహకులు పంపారు. నిర్వాహకులను బళ్లారికి చెందిన స్వప్న లక్ష్మి ప్రియగా గుర్తించినట్లు సీఐ శివప్రసాద్ రెడ్డి తెలిపారు. బెంగుళూరు గుడివాడ నుంచి యువతులను రప్పించి జీవకోన శ్రీనగర్ కాలనీకి చెందిన సాయి చరణ్ ద్వారా లక్ష్మిప్రియ స్వప్నలు వ్యభిచారం నిర్వహిస్తుండగా దాడి చేసి పట్టుకున్నామని సీఐ తెలిపారు. పలువురు యువతులను రక్షించినట్లు ఆయన వెల్లడించారు. ఈ చీకటి వ్యాపారాన్ని గుర్తించిన వ్యక్తి పోలీసులకు సమాచారమిచ్చాడు. రంగంలోకి దిగిన తిరుపతి ఈస్ట్ సీఐ శివప్రసాద్ రెడ్డి వ్యభిచార ముఠాను అదుపులోకి తీసుకున్నారు. దీనితో సంబంధమున్న నలుగురిపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. ఇద్దరు నిర్వాహకులను అరెస్ట్ చేసినట్లు సీఐ శివప్రసాద్ రెడ్డి వెల్లడించారు.