Begin typing your search above and press return to search.

ఉగ్ర‌వాదిని అప్ప‌గిస్తే భార‌తీయుడిని ఉరితీయ‌బోం!

By:  Tupaki Desk   |   29 Sep 2017 7:37 AM GMT
ఉగ్ర‌వాదిని అప్ప‌గిస్తే భార‌తీయుడిని ఉరితీయ‌బోం!
X
పాకిస్థాన్ ఇప్పుడిప్పుడే కాస్త దారిలోకి వ‌స్తున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. అంత‌ర్జాతీయ సంబంధాలు - దౌత్య‌రీతి వంటి వాటిల్లో కాస్త ప‌రిణ‌తిని క‌నిపిస్తుంద‌ని చెప్తున్నారు. ఇదంతా ఇప్పుడు పాక్ క‌ద‌లిక‌లు చూసి రాజ‌కీయవ‌ర్గాల్లో సాగుతున్న మాట‌. గూఢచారి ముద్ర వేసి ఉరిశిక్ష వేసిన భారత జాతీయుడు కుల్‌ భూషన్ జాదవ్ విష‌యంలో పాక్ ఆలోచన తీరు విష‌యంలో ఈ ప్ర‌స్తావ‌న చ‌ర్చ‌కు వ‌స్తోంది. అంత‌ర్జాతీయ దౌత్య‌రీతి ప్ర‌కారం దేశాల మధ్య ఖైదీల మార్పిడి అన్నది సాధారణమే. అయితే ఈ దౌత్య‌రీతిలో భారత జాతీయుడు కుల్‌ భూషన్ జాదవ్‌ ను పాకిస్థాన్ భారత్‌ కు అప్పగిస్తుందా అన్న చర్చ మొదలైంది. ఈ విషయాన్ని ఆ దేశ విదేశాంగ మంత్రి ఖవాజా ఆసిఫే చెప్పారు.

రెండేళ్ల కిందట పాకిస్థాన్‌ లో పెషావర్ సైనిక స్కూల్‌ పై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడి సూత్రధారి అయిన తెహ్రికె తాలిబాన్ పాకిస్థాన్ చీఫ్ ముల్లా ఫజుల్లాను ఆఫ్ఘనిస్థాన్ పట్టుకుంది. ఆ ఉగ్రవాదిని మీకిచ్చేస్తాం.. కుల్‌ భూషణ్‌ ను మాకు వదిలేయండి అని ఆఫ్ఘనిస్థాన్ జాతీయ భద్రతా సలహాదారు ఓ ఆఫర్ ఇచ్చినట్లు ఖవాజా ఆసిఫ్ వెల్లడించారు. మొన్న న్యూయార్క్‌ లో జరిగిన ఏషియా సొసైటీ సమావేశంలో ఈ విషయాన్ని తెలిపారు. ఆఫ్ఘన్ ఎన్‌ ఎస్‌ ఏ ఎప్పుడు ఈ ఆఫర్ ఇచ్చారన్నది మాత్రం ఆయన చెప్పలేదు. అంతేకాదు ఈ ఆఫర్‌ కు పాకిస్థాన్ అంగీకరించిందా లేదా అన్నది కూడా ఆసిఫ్ వెల్లడించలేదు. అయితే ఇండియా - ఆఫ్ఘనిస్థాన్ మాత్రం ఆయన వ్యాఖ్యలని ఖండించాయి. ఖవాజా కావాలనే ఈ కామెంట్స్ చేసి ఉంటారని భారత విదేశాంగ అనుమానిస్తోంది.

మ‌రోవైపు ఇంకో రెచ్చ‌గొట్టే చ‌ర్య‌కు దిగింది. చైనాలో ఇటీవల నిర్వహించిన సంయుక్త సైనిక విన్యాసాల్లో భాగంగా మొట్టమొదటిసారిగా చైనా - పాకిస్తాన్‌ లకు చెందిన వైమానిక దళ పైలట్లు యుద్ధ విమానాలను నడిపారు. చైనా ఆర్మీ ప్రతినిధి కల్నల్ వు క్వియాన్ ఈ వీడియోను ప్రదర్శించడం ద్వారా తమ రెండు దేశాల మధ్య సంబంధాలు ఎంతగా బలమైనవో మరోసారి చాటిచెప్పారు. జింజియాన్ నగరంలో ఈ నెల 2వ తేదీనుంచి 25 దాకా ‘షహీన్-6’ పేరుతో జరిగిన ఈ సంయుక్త వైమానిక విన్యాసాల్లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. పాకిస్తాన్ - చైనా దేశాల సైన్యాల మధ్య ఉన్న సహకారాన్ని అన్నికాలాల్లో నిలిచి ఉండే సోదరభావం - అత్యున్నత స్థాయి పరస్పర సహకారం - మద్దతు - బలమైన వ్యూహాత్మక పరస్పర విశ్వాసంతో కూడుకొన్నదిగా ఆయన అభివర్ణించారు. అయిదేళ్ల క్రితం మొదలైన ఈ విన్యాసాల్లో మొట్టమొదటిసారిగా ఇరు దేశాల వైమానిక దళ పైలట్లు రాత్రి పూట యుద్ధ సన్నద్ధ శిక్షణా కార్యక్రమాలను నిర్వహించినట్లు వు తెలిపారు. అంతేకాదు ఇరు దేశాలకు చెందిన పైలట్లు కూడా ఒకే రకమైన విమానాలను నడిపారని ఆయన తెలిపారు.