Begin typing your search above and press return to search.
అమ్రపాలికి ప్రమోషన్... ఏకంగా పీఎంఓలోనే పోస్టింగ్
By: Tupaki Desk | 13 Sept 2020 4:20 PM ISTవిధి నిర్వహణలో సమర్థవంతమైన అధికారిణిగా గుర్తింపు సంపాదించిన ఐఏఎస్ అధికారిణి అమ్రపాలి తాజాగా బంపర్ ప్రమోషన్ కొట్టేశారు. తెలంగాణ కేడర్ ఐఏఎస్ అదికారిణిగా కొనసాగుతున్న అమ్రపాలి... ఇటీవలే కేంద్ర సర్వీసులకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సికింద్రాబాద్ ఎంపీగా విజయం సాధించి కేంద్ర హోం శాఖ సహాయమంత్రిగా పనిచేస్తున్న కిషన్ రెడ్డికి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రధానమంత్రిత్వ కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా ఆమెను నియమిస్తున్నట్లుగా కేబినెట్ నియామకాల కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. పీఎంఓ డిప్యూటీ సెక్రటరీగా హోదాలో ప్రధాని నరేంద్ర మోదీ బృందంలో అమ్రపాలి కీలకంగా వ్యవహరించనున్నారు.
ఉమ్మడి ఏపీ కేడర్ ఐఏఎస్ అదికారిణిగా బాధ్యతలు స్వీకరించిన అమ్రపాలి... ఏపీలోని విశాఖ జిల్లాకు చెందిన వారు. విశాఖలోనే జన్మించిన అమ్రపాలి... ఐఐటీ చెన్నై నుంచి బీటెక్, ఐఐఎం బెంగళూరు నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ఆ తర్వాత 2010లో సివిల్ సర్వీసెస్ కు ఎంపికైన అమ్రపాలి.. తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారిణిగానే కొనసాగేందుకు ఇష్టపడ్డారు. ఈ క్రమంలో వరంగల్ జిల్లా కలెక్టర్ గా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న క్రమంలో జనంతో మమేకం అయిన అమ్రపాలి... అక్కడి ప్రజల గుండెల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. అమ్రపాలి తమకు చేసిన సేవలకు మెచ్చిన కొందరు ప్రజలు ఆమెకు ఏకంగా గుడి కట్టించిన వార్త వైరల్ అయిన సంగతి తెలిసిందే.
ప్రధానమంత్రిత్వ కార్యాలయం (పీఎంఓ)లో పోస్టింగ్ అంటే... విధానపర నిర్ణయాల్లో కీలక భాగస్వామ్యం లభించినట్టేనని చెప్పక తప్పదు. ఈ క్రమంలో ఓ జిల్లా కలెక్టర్ గానే మంచి గుర్తింపు పొందిన అధికారణిగా గుర్తింపు పొందిన అమ్రపాలి.. పీఎంఓలో పోస్టింగ్ తో మరింత మేర మంచి పేరును సంపాదిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి. ఇదిలా ఉంటే... అమ్రపాలితో పాటు మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులను కూడా పీఎంఓలో నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వీరిలో మధ్యప్రదేశ్ 2004 కేడర్ కు చెందిన రఘురాజ్ రాజేంద్రన్ పీఎంఓ డైరెక్టర్ గా నియమితులు కాగా... ఉత్తరాఖండ్ 2012 కేడర్ కు చెందిన మంగేశ్ గిల్డియాల్ పీఎంఓలో అండర్ సెక్రటరీగా నియమితులు అయ్యారు.