Begin typing your search above and press return to search.
వివాహం కోసం మతం మార్చుకోవడం ఇక నిషేధం
By: Tupaki Desk | 5 Nov 2020 10:30 PM ISTఉత్తరభారత దేశంలో లవ్ జిహాద్ కేసులు పెరిగిపోతున్నాయి. దీని వల్ల రెండు మతాల మధ్య దాడులు, ఘర్షణలు, ఉద్రిక్తతలు , హత్యలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం కొత్త చట్టం చేసింది.
వివాహం కోసం మతం మార్చుకుంటున్న ఘటనలు ఇటీవల వరుసగా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో మతం మారటాన్ని నిషేధిస్తూ కొత్త చట్టాన్ని తీసుకొస్తామని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. వివాహం పేరుతో మతం మార్చేందుకు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు.వివాహం కోసం మత మార్పిడులను సహించమని దీనిని అడ్డుకునేందుకు కఠిన చట్టాన్ని తీసుకొస్తామని తెలిపారు. త్వరోనే ఈ చట్టం అమల్లోకి వస్తుందన్నారు.
ఇప్పటికే లవ్ జిహాద్ ను అరికట్టేందుకు ఉత్తరప్రదేశ్, కర్ణాటక, హర్యానా రాష్ట్రాలు మత మార్పిడి నిషేధ చట్టాన్ని తీసుకొస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించాయి. ఈ క్రమంలోనే మధ్య ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇటువంటి చట్టాన్ని తీసుకొచ్చేందుకు నిర్ణయించింది.
మధ్యప్రదేశ్ లోనూ లవ్ జిహాద్ కేసులు ఇటీవల వెలుగుచూశాయి. దాడులు, హత్యలు జరిగాయి. బీజేపీ పాలిత రాష్ట్రం కావడంతో దీన్ని అరికట్టాలని సీఎం శివరాజ్ నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఈ కఠిన చట్టం అమలు చేయడానికి రెడీ అయ్యారు.