Begin typing your search above and press return to search.

సొంత మీడియాతో వ‌స్తున్న కోదండ‌రాం

By:  Tupaki Desk   |   2 Jan 2017 1:56 PM GMT
సొంత మీడియాతో వ‌స్తున్న కోదండ‌రాం
X
తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెస‌ర్ కోదండరాం సొంత మీడియాతో ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యేందుకు ముందుకు వ‌చ్చారు. హైదరాబాద్ నాంపల్లి జేేఏసీ కార్యాలయంలో తెలంగాణ జేఏసీ వెబ్ సైట్ ను ఛైర్మన్ కోదండరాం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ...తెలంగాణ జేఏసీ మరింత ప్రజలకు చేరువ కావడానికి ప్రత్యేక వెబ్ సైట్ ను రూపొదించుకుందని తెలిపారు. ఎన్ని ఒత్తిడులు ఎదురైనా అంబేడ్కర్ మార్గంలో రాజ్యాంగ బద్దంగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఓపెన్ కాస్ట్ మైనింగ్ స్పందించిన కోదండరాం అండర్ గ్రౌండ్ మైనింగ్ చేయాలని కోదండ‌రాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సర్కార్ పై ప్రతిపక్షాల చేస్తున్న పోరాటం నిర్ధిష్టంగా వ్యూహత్మకంగా వ్యవహరించాలని.. ఖచ్చింతగా ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టేలా ఉండాలని కోదండరాం ఆకాంక్షించారు. తెలంగాణలో పెద్దఎత్తున చెరువల్లో...రిజర్వాయర్లలో చేపలు పెంచుతున్నందున ఫిషరీస్ పాలసీపై ప్రత్యేక డాక్యూమెంటరీ రూపొందించామని దాని పై విస్తృత స్థాయిలో చర్చ జగరాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్య పాలసీని ప్రకటించి దళారి వ్యవస్థను రూపుమాపేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. మత్స్య అభివృద్ది సంస్థను ఏర్పాటు చేయాలని, చేపల సీడ్స్ ఉత్పదన కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి విద్యావిధానం లేనందును ఈనెల 7 తేదీ నుంచి జేఏసీ ఆధ్వర్యంలోవిద్యా యాత్రం చేపడుతున్నామ‌ని కోదండ‌రాం ప్ర‌క‌టించారు. విద్యావ్యవస్థ పై పూర్తి స్థాయి నివేధిక రూపొందిస్తామ‌ని తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/