Begin typing your search above and press return to search.

ప‌క్కాగా ముందుకు వెళ్తున్నామంటున్న మాష్టారు

By:  Tupaki Desk   |   20 Feb 2017 12:17 PM GMT
ప‌క్కాగా ముందుకు వెళ్తున్నామంటున్న మాష్టారు
X
ఈనెల 22 న జరిగే నిరుద్యోగుల ర్యాలీకి పోలీసుల నుంచి అనుమ‌తి వ‌స్తుంద‌ని భావిస్తున్నట్లు తెలంగాణ జేఏసీ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్‌ కోదండరాం ఆశాభావం వ్య‌క్తం చేశారు. ర్యాలీకి అనుమ‌తి ఇవ్వాల‌ని హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసిన అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగ‌ ర్యాలీ విజ‌య‌వంతం చేసేందుకు క్రియాశీలంగా ముందుకు సాగుతున్న‌ట్లు వివ‌రించారు. ఇందులో భాగంగా నిర‌స‌న పూర్తి స్థాయిలో విజ‌య‌వంతం అయ్యేందుకు 15 సబ్ కమిటీలతో స్టేజీ నిర్వ‌హ‌ణ‌ - కళాకారుల ఆటా పాటలు - మెడికల్ టీం - బ్యానర్లు...ఇలా అన్ని ఏర్పాట్లు ప‌క్కాగా చేస్తున్నామ‌ని కోదండ‌రాం వివ‌రించారు. ర్యాలీలో అంతా శాంతియుతంగా పాల్గొనాల‌ని కోరారు. ర్యాలీలో ఎవరయినా రెచ్చగొట్టే ప్రయ‌త్నం చేయవచ్చ‌ని దానికి ఆక‌ర్షితులు కావ‌ద్ద‌ని జేఏసీ వ‌ర్గాల‌కు సూచించారు. ఈ ర్యాలీకి ఎన్నారైల మద్దతు ఉందని, ఎన్నారైలు శాంతియుతంగా జరుగాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఉదయం 10 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ర్యాలీ ప్రారంభం అయి ఇందిరా పార్క్ లో మీటింగ్ ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు.

ర్యాలీ సంద‌ర్భంగా నిరుద్యోగుల నుంచి వినతులు సేకరించడానికి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తున్నామ‌ని కోదండ‌రాం ప్ర‌క‌టించారు. చిన్న ఉద్యోగుల నుంచి నిరుద్యోగులు అందరూ పాల్గొంటారని వివ‌రించారు. అన్ని జిల్లాల విద్యార్ధి సంఘాలు - రాజకీయ పార్టీలు - స్టూడెంట్ సంఘాలు పాల్గొంటున్నాయని వివరించారు. ర్యాలీలో పాల్గొన‌కుండా ముందస్తుగా చాలా మందిని అరెస్ట్ చేశార‌ని వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. త్వ‌ర‌లో డీఎస్‌ సీ అంటూ ఇప్పటి వరకూ ప్రకటనలు చేశారే త‌ప్ప నోటిఫికేషన్ మాత్రం ఇవ్వ‌లేద‌ని కోదండ‌రాం వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం ఉన్న లక్ష 7 వేల ఖాళీలు - రాబోయే రెండు సంవత్సరాలలో 30 వేల ఖాళీలు ఏర్పడుతుండ‌టాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని వీట‌న్నింటినీ యుద్ధ ప్రాతిప‌దిక‌న భ‌ర్తీ చేయాల‌ని కోరారు. ఈ సంద‌ర్భంగా కోదండ‌రాం 5 డిమాండ్లు చేశారు.అవి...ఖాళీల భర్తీ వెంటనే విడుదల చేయాలి, కాంట్రాక్టు ఉద్యోగుల కు సమానపనికి సమనవేతనం ఇవ్వాలి, పోటీ పరీక్షల క్యాలెండర్ ని విడుదల చేయాలి, ప్రైవేట్ రంగంలో ఉద్యోగ నియమాకాలో స్థానిక రిజర్వేషన్లు కలిపించాలి, డీఎస్‌ సీని వెంటనే ప్రకటించాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/