Begin typing your search above and press return to search.

జేఏసీ మీటింగ్ కు ఇంత మంది పోలీసులా కేసీఆర్‌?

By:  Tupaki Desk   |   19 April 2019 4:44 AM GMT
జేఏసీ మీటింగ్ కు ఇంత మంది పోలీసులా కేసీఆర్‌?
X
బ‌షీర్ బాగ్ ప్రెస్ క్ల‌బ్ లో చిన్న చిన్న స‌మావేశాలు జ‌రుగుతుంటాయి. దీనికి సంబంధించిన స‌మాచారం ప్ర‌ధాన ప‌త్రిక‌లో కాదు క‌దా.. చాలావ‌ర‌కూ మినీల‌కు ప‌రిమితం చేస్తుంటారు. అలా అని.. అక్క‌డ జ‌రిగే స‌భ‌లు.. స‌మావేశాలు చిన్న‌వ‌ని కాదు.. వాటికి ప‌త్రిక‌ల్లో ఇచ్చే ప్రాధాన్యం చెప్ప‌ట‌మే ముఖ్య ఉద్దేశం.

తాజాగా నిరుద్యోగ జేఏసీ స‌మావేశాన్ని బ‌షీర్ బాగ్ ప్రెస్ క్ల‌బ్ లో నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి పెద్ద ఎత్తున నిరుద్యోగుల‌తో పాటు.. కోదండం మాష్టారు..ఆర్ కృష్ణ‌య్య లాంటి వారు హాజ‌ర‌య్యారు. స‌భ జ‌రుగుతున్న వేళ‌.. బ‌షీర్ బాగ్ ప్రెస్ క్ల‌బ్ ను పోలీసులు మొహ‌రించిన తీరు చూస్తే అవాక్కు అవ్వాల్సిందే.

ఓప‌క్క స‌మావేశం ప్రశాంతంగా కొన‌సాగుతున్న వేళ‌.. టాస్క్ ఫోర్స్ అడిష‌న‌ల్ డీసీపీ చైత‌న్య‌కుమార్ ఆధ్వ‌ర్యంలో న‌లుగురు ఏసీపీలు.. 10 మంది ఇన్ స్పెక్ట‌ర్లు.. 20 మంది ఎస్ ఐలు.. 200 మంది కానిస్టేబుళ్లు రౌండ‌ప్ చేయ‌టం విశేషం. కోదండం..కృష్ణ‌య్యల‌తో పాటు.. బీసీ సంగం నేత గుజ్జ కృష్ణ‌తోపాటు నిరుద్యోగ జేఏసీ ఛైర్మ‌న్ నీల వెంక‌టేశ్ త‌దిత‌రుల‌ను 45 నిమిషాల పాటు ప్రెస్ క్ల‌బ్ లో నిర్బంధించి.. ఆ త‌ర్వాత అరెస్ట్ చేసిన తీరు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ఒక రోటీన్ కార్య‌క్ర‌మాన్ని పోలీసులు ఇంత భారీగా రౌండ‌ప్ చేయ‌టం.. అదుపులోకి తీసుకోవ‌టం లాంటివి చూస్తే.. ఒక చిన్న స‌మావేశానికి ఇంత పోలీసు సిబ్బంది రౌండ‌ప్ చేయ‌టం అవ‌స‌ర‌మా? ప్ర‌భుత్వం తీరును విమ‌ర్శిస్తూ పెట్టుకునే ప్ర‌తి మీటింగ్ ను ఇలా భూత‌ద్దంలో చూస్తూ.. ఇంత హ‌డావుడి ఎందుకన్న సందేహం రాక మాన‌దు.