Begin typing your search above and press return to search.

అదే జరిగితే బంగారం ఈజీగా దొరికినా నీరు దొరకడం కష్టం

By:  Tupaki Desk   |   1 Aug 2021 2:30 AM GMT
అదే జరిగితే బంగారం ఈజీగా దొరికినా నీరు దొరకడం కష్టం
X
ఇప్పటికే చాలా ప్రాంతాల్లో నీళ్లు దొరకడం గగనం అయిపోయింది. చాలా ప్రాంతాల్లో ఒక్కొక్కటిగా బావులు, చెరువులు, జలాశయాలు అడుగంటుకుని పోవడం మూలాన తాగేందుకు నీరు దొరకడమే గగనం అవుతుంది. ఇక ఈ సమయంలో నీటి కోసం యుద్దాలు జరుగుతున్నాయి. ఇళ్ల ముందు నిలిపిన కార్పొరేషన్ వాటర్ ట్యాంకుల దగ్గర, రాష్ర్టాల మధ్య, వివిధ దేశాల మధ్య కూడా జల జగడాలు ముదురుతున్నాయి. ఇటువంటి తరుణంలో శాస్త్రవేత్తలు చేసిన ఓ పని ఇప్పుడు కొత్త చిక్కులను తీసుకొచ్చేలా ఉంది. వారు నీటితో బంగారాన్ని కూడా తయారు చేయవచ్చని ప్రకటించారు.

ఇప్పటికే నీటి కోసం అనేక యుద్దాలు నడుస్తున్న ఈ తరుణంలో నీటితో బంగారం అంటే ఇక గొడవలు ఏ రేంజ్ లో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అసలే బంగారం అంటే జనాలకు విపరీతమైన మోజు. ఎంతలా ధరలు పెరుగుతున్నా సరే ఎలాగైనా సరే బంగారం వేసుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఎంతటి కష్టాలైనా సరే భరిస్తారు. ప్రస్తుతం నీటిని బంగారంగా మార్చ వచ్చనే వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ వార్తలు విన్న పలువురు మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్త గనుక నిజమైతే భవిష్యత్ లో మానవులకు నీరు దొరకడం కూడా కష్టంగా మారుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతలా మనుషులు బంగారం అంటే మక్కువను కలిగి ఉంటారని వివరిస్తున్నారు.

ఇలా నీటిని బంగారంగా మార్చే ప్రక్రియలో టైమింగ్ చాలా ముఖ్యమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రేగ్ లోని చెక్ అకాడమీ శాస్త్రవేత్తలు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నిజం చెప్పాలంటే నీరు లోహం కాదని వారు తెలుపుతున్నారు. ప్రస్తుత రోజుల్లో లోహాలు కాని అనేక వస్తువులను లోహాలుగా మార్చడం వీలవుతుందని అంటున్నారు. ఏ వస్తువులోనైనా సరే ఉన్న అణువులు, పరమాణువులను సందు లేకుండా ఒకే చోటికి చేరిస్తే అవి లోహాలుగా మారిపోతాయని చెబుతున్నారు. నీటిని కూడా అలాగే బంగారంలా మార్చే వీలుంటుందని చెబుతున్నారు. ఇందు కోసం కొన్ని క్షార లోహాలు నీటిపై ప్రయోగిస్తే సరిపోతుందని వివరిస్తున్నారు. అయితే ఇలా నీటిని బంగారంగా మార్చే ప్రక్రియ అనుకున్నంత ఈజీ కాదని చెబుతున్నారు. ఈ ప్రక్రియలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకు అనే విషయాలను కూడా వారు వెల్లడించారు.

కొన్ని వస్తువులకు నీరు తగిలితే అవి పేలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకనే చాలా జాగ్రత్తలు తీసుకుని ఈ చర్యలను చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. సోడియం, పొటాషియం ద్రావణం బిందువులను విడుదల చేస్తూ నీటి ఆవిరితో చర్య జరపడం వలన నీరు బంగారంలా మారుతుందని వారు చెబుతున్నారు. రాబోయే 50.. 100 ఏళ్లలో నీళ్లతో బంగారం కనుక తయారు చేసే ప్రయోగాలు సక్సెస్‌ అయితే ఈజీగా బంగారంను తయారు చేసుకుంటారు. ఇప్పుడు 50 వేలు ఉన్న బంగారం ధర అప్పుడు భారీగా తగ్గే అవకాశం ఉంది. బంగారం ఈజీగానే లభిస్తుంది... కాని ఇప్పుడు బంగారంను ఎలా అయితే కొనుక్కున్నామో అలాగే అప్పటికి నీటిని కొనుగోలు చేయాల్సి రావచ్చు అంటూ నిపుణులు చెబుతున్నారు.