Begin typing your search above and press return to search.
ఈవీఎంలో ఓట్లకు.. వీవీ ప్యాట్ చిట్టీల లెక్క తేలకుంటే?
By: Tupaki Desk | 9 May 2019 12:22 PM ISTఎన్నికల అంకం దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఇప్పుడు అందరి దృష్టి ఓట్ల లెక్కింపు మీదనే. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఈవీఎంలు వర్సెస్ వీవీ ప్యాట్ ఇష్యూ నడుస్తున్న వేళలో కొత్త సందేహాలొస్తున్నాయి. అందులో ప్రధానమైనది.. ఈవీఎంలలో పోలైన ఓట్లకు.. వీవీ ప్యాట్ లలో నమోదైన స్లిప్పులకు మధ్య తేడా వస్తే ఏం జరుగుతుందన్నది ప్రశ్నగా మారింది.
ప్రశ్నకు సమాధానం ముందు.. మరో ప్రశ్న.. అసలు ఓటు వేసేటప్పుడు కచ్ఛితంగా వీవీ ప్యాట్ లో స్లిప్పు పడుతుంది కదా? అని ప్రశ్నించొచ్చు. కానీ.. అలా పడని సందర్భాలు దాదాపుగా ఉండవని చెబుతున్నా.. అలాంటి అవకాశాలు చాలానే ఉంటాయని.. తాజా ఓట్ల లెక్కింపు వేళలో అలాంటి సిత్రాలు చాలానే చూడొచ్చన్న మాట బలంగా వినిపిస్తోంది.
దీంతో.. ఈవీఎంలకు.. వీవీ ప్యాట్ లలో నమోదైన ఓటరు స్లిప్పులకు మధ్య వ్యత్యాసం ఖాయమనే అనుకుందాం. అలా జరిగితే ఏం జరుగుతుందన్న ప్రశ్నకు సమాధానం ఆసక్తికరంగా ఉందని చెప్పాలి. ఒకవేళ రెండింటి మధ్య ఓట్లు సరిపోలితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫలితాల్ని వెంటనే ప్రకటిస్తారు.
ఒకవేళ.. వీవీ ప్యాట్ చిట్టీలు తక్కువ.. ఈవీఎంలలో ఓట్లు ఎక్కువగా ఉంటే.. రెండింటి మధ్య తేడా లేకుండా ఉండేందుకు వీలుగా పలుమార్లు రీకౌంటింగ్ నిర్వహిస్తూనే ఉంటారు. అప్పటికి లెక్క తేలకుంటే.. ఆ విషయానని ఎన్నికల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతారు. చివరకు వీవీ ప్యాట్ చిట్టీలను పరిగణలోకి తీసుకొని.. అందులో నమోదైన ఓట్లను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. అంటే.. ఈవీఎంలలో కంటే వీవీ ప్యాట్ చిట్టీలకే అధిక ప్రాధాన్యత ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.