Begin typing your search above and press return to search.
ఇక్కడ రాష్ట్రాల మధ్య యుద్ధాలు జరుగుతాయా..?
By: Tupaki Desk | 29 Sept 2015 4:00 AM ISTభారతదేశం సరిహద్దు దేశాలతో సామరస్యంగా ఉండేందుకు, వివాదాలు పరిష్కరించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటే రాష్ట్రాలు మాత్రం తమ పొరుగు రాష్ట్రాలతో ఢీ అంటే ఢీ అంటున్నాయి. ప్రధాని మోడీ వివిధ దేశాలు తిరుగుతూ పాతమిత్రులతో బంధాలు పెంచుకుంటూ, కొత్త మిత్రులను కలుపుకొంటూ వెళ్తుంటే దేశంలో అంతర్గతంగా మాత్రం రాష్ట్రాలు ఒకదానితో ఒకటి శత్రువుల్లా ఉంటున్నాయి. ఒక్కోసారి రాష్ట్రాల మధ్య యుద్ధాలు జరుగుతాయా అన్నంతలా ఉద్రిక్త వాతావరణ ఏర్పడుతోంది.
ఇటీవల కాలంలో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ భారత్ - పాక్ ల మధ్య... భారత్ - చైనాల మధ్య సంబంధాలు గతం కంటే మెరుగయ్యాయి. మోడీ ప్రధాని అయిన తరువాత ఆయాదేశాల పెద్దలు ఇండియాకు వచ్చారు. ద్వైపాక్షిక సంబంధాలు బలపడ్డాయి. పాక్ లో ఉన్న భారత ఖైదీలు.. భారత్ లో ఉన్న పాక్ ఖైదీలను విడుదల చేస్తున్నారు. శ్రీలంక విషయమూ అంతే... దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత శ్రీలంకలో ఇటీవలే భారత ప్రధాని పర్యటించారు. 26ఏళ్ళ అనంతరం బంగ్లాదేశ్ ను భారత ప్రధాని సందర్శించారు. రెండు దేశాల మధ్య ఉన్న సరిహద్దు సమస్యను కొంతవరకు పరిష్కరించుకున్నారు. భూటాన్ భారత్ సరికొత్త సంబంధాల్ని ఏర్పాటు చేసుకుంది. నేపాల్ భూకంపంలో చిక్కుకుని విలవిలలాడితే చేతికి ఎముక లేకుండా సాయం చేసింది ఇండియా. కాందిశీకుల రక్షణపై మయన్మార్-భారత్ ల మధ్య ఒప్పందాలు కుదిరాయి. ఇలా సరిహద్దు దేశాలన్నింటి తో రెండు దశాబ్దాలుగా క్షీణించిన బంధాల్ని మోడి తిరిగి బలోపేతం చేస్తున్నారు. ఇందుకోసం ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తన పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి దక్షిణాసియా దేశాల పాలకులందర్నీ ఆహ్వానించి సరికొత్త సంప్రదాయానికి మోడి శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచే ఈ సౌహార్ద్రతకు బీజం పడింది.
అయితే.... పొరుగుదేశాలతో మంచి సంబంధాలు నెలకొల్పుకుంటున్న భారత్ లో అంతర్గతంగా చూస్తే కొట్లాటలే కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు జుత్తులు పట్టుకుంటున్నాయి. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయినా తెలంగాణ పాలకులు నవ్యాంధ్ర ప్రదేశ్ ను సహించలేకపోతున్నారు. గత రాజకీయ విభేదాలతో ఇప్పటికీ ఏపీ, తెలంగాణల మధ్య ఎన్నో వివాదాలు రగులుతున్నాయి. కరెంటు - నీరు - చదువులు... ఆస్తుల పంపకాలు - ఉద్యోగులు పంపకాలు.. ఇలా ప్రతిదీ గొడవగా మారి కోర్టులకెక్కుతున్నారు.
మరోవైపు ఏపీకి తమిళనాడుతోనూ పడడం లేదు. శేషాచలం లో ఎర్రచందనం తమిళ కూలీల ఎన్ కౌంటర్ తో రెండు రాష్ట్రాల మధ్య వివాదమేర్పడింది. ఆ కారణంతోనో ఏమో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆ రాష్ట్రంలో తెలుగుభాషను కనిపించకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారు. తెలుగుభాషను కూడా ఆమె ఓ శతృవుగా పరిగణిస్తున్నారు. దీంతో తమిళనాడులో ఉన్న కోటిన్నర మందిపైగా తెలుగు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కర్ణాటకతోనూ జల వివాదాలున్నాయి ఏపీకి... పోలవరం ప్రాజెక్టు విషయంలో ఒడిశాతో విభేదాలున్నాయి. చత్తీస్ గఢ్ తో సరిహద్దు సమస్యలున్నాయి.
అదేవిధంగా కర్ణాటక - తమిళనాడుల మధ్య జలవివాదాలు... ఒడిశా - బెంగాల్ ల మధ్య బంగాళదుంప వివాదాలు, రసగుల్లా పేటెంట్ వివాదాలు ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల సంగతి చెప్పనవసరం లేదు. అక్కడ ప్రజల మధ్యా గొడవలు పెరిగి నాగాలాండ్-అస్సాం - నాగాలాండ్-మిజోరాం సరిహద్దుల్లో ఒకరిపై ఒకరు దాడులకు దిగుతూ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఉత్తరాదిలోనూ రాష్ట్రాల మధ్య వివాదాలు కోకొల్లలు.
ఇదంతా ఎలా ఉన్నా తెలుగు రాష్ట్రాల సంగతి చూసుకుంటే కొంతవరకు నాయకుల కారణంగా వివాదాలు పరిష్కారం కావడం లేదనిపిస్తోంది. ప్రతి చిన్న విషయానికి మంత్రులు రెచ్చిపోయి ప్రకటనలిస్తున్నారు. తొడలు కొట్టి సవాళ్లు విసురుకుంటున్నారు. ఏపీ మంత్రులు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించేందుకు కూడా ఇష్టపడ్డంలేదు. రాజకీయ లబ్ధికే తప్ప ప్రజల మధ్య సత్సంబం ధాలకు వీరెవరూ ప్రయత్నించడం లేదు. వాస్తవానికి విభజనానంతరం తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి సరిహద్దు తగాదాల్లేవు. అనవసర వివాదాలతో దూరాన్ని పెంచుతున్నారు.
ఇప్పటికైనా సరిహద్దు రాష్ట్రాలతో సఖ్యతగా ఉంటే ఎంతో ప్రయోజనం ఉంటుంది. లేదంటే రాష్ట్రాల మధ్య వివాదాలను అడ్డంపెట్టుకుని కేంద్రం పట్టు సాధిస్తే మరింత ఇబ్బందిపడడం ఖాయం. ఇది అభివృద్ధిపైనా ప్రభావం చూపుతుంది.
- గరుడ