Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ను కాపీ కొడితే.. జ‌గ‌న్‌కు ఇబ్బందేనా?

By:  Tupaki Desk   |   8 Nov 2021 6:25 PM IST
కేసీఆర్‌ను కాపీ కొడితే.. జ‌గ‌న్‌కు ఇబ్బందేనా?
X
ఏపీ సీఎం జ‌గ‌న్‌.. తెలంగాణ ముఖ్య‌మంత్రి, త‌న స్నేహితుడు.. కేసీఆర్‌ను కాపీ కొడుతున్నారా? ఆయ‌నలాగానే జ‌గ‌న్ కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే.. ఈ ప‌రిస్థితి జ‌గ‌న్‌కు మేలు చేయ‌క‌పోగా.. ఇబ్బందులు కొనితెస్తుంద‌ని చెబుతున్నారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ తండ్రి.. దివంగ‌త ముఖ్య‌మంత్రి రాజ‌శేఖ‌ర‌రెడ్డి అనుస‌రించిన విధానాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ముఖ్య‌మంత్రిగా ఆయ‌న ప్ర‌జ‌ల‌తో ఎలా మ‌మేక మ‌య్యారు? ఎలా ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకొన్నా రు? అనే విష‌యాల‌ను వారు తెర‌మీదికి తెస్తున్నారు. ఇలా ఉన్న నేత కాబ‌ట్టే.. ప్ర‌జ‌ల్లో ఆయ‌న‌కు చిర‌స్థానం ల‌భించింద‌ని చెబుతున్నారు.

వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి 2004 ఎన్నిక‌ల్లో గెలిచిన త‌ర్వాత‌.. చాలా మార్పును చూపించారు. అప్ప‌టి వ‌ర‌కు విప‌క్ష నేత‌ల‌పై.. పార్టీల‌పై ఉన్న కోపాన్ని ముఖ్యంగా సొంత పార్టీలోనే ఉన్న అసమ్మ‌తి నాయకుల‌పై ఉన్న ఆగ్ర‌హాన్ని ఆయ‌న చాలా వ‌ర‌కు త‌గ్గించుకున్నారు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే.. కోపాన్ని లేకుండా చేసుకున్నారు. ప్ర‌జ‌ల‌కు ఏదైనా చేయాల‌నే ల‌క్ష్యంతో ముందుకు సాగారు. నిజానికి రాజ‌శేఖ‌ర‌రెడ్డి జీవితంలో చాలా సుదీర్ఘ ప్ర‌యాణం త‌ర్వాత‌.. ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ద‌క్కింది. దీంతో ఆ పోస్టును కాపాడుకోవ‌డం.. ఆయ‌న‌కు క‌త్తిమీద సాము వంటిది. దీనిని ఆయ‌న చాలా జాగ్ర‌త్త‌గా నిర్వ‌హించారు. దీనికి కూడా ఒక కార‌ణం ఉంది.

కాంగ్రెస్‌లో ఆది నుంచి కూడా ముఖ్య‌మంత్రుల‌ను త‌ర‌చుగా మార్చే సంప్ర‌దాయం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకున్న వైఎస్‌.. ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యారు. ప్ర‌జ‌ల మ‌న‌సులు దోచుకున్నాడు. ఉద‌యం నుంచి క‌నీసం రెండు గంట‌ల పాటు.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు వినేందుకు.. మాట్లాడేందుకు స‌ల‌హాలు ఇచ్చేందుకు అవ‌కాశం క‌ల్పించారు. దీంతో ఆయ‌న ప్ర‌జా నేత‌గా అన‌తి కాలంలోనే ఎన‌లేని గుర్తింపు సాధించారు. మ‌రోవైపు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏదైనా ప‌ని ఉండి వ‌చ్చినా,, ఆఖ‌రుకు ప్ర‌తిప‌క్ష నాయ‌కులు ప‌నిపై వ‌చ్చినా. రాజ‌శేఖ‌ర‌రెడ్డి టైం ఇచ్చి.. వాళ్ల స‌మ‌స్య‌లు విన‌డ‌మే కాకుండా.. ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశారు. ఒక‌వేళ ఆయా స‌మ‌స్య‌లు జ‌ఠిలంగా ఉంటే.. వారిని బుజ్జ‌గించి.. త‌ర్వాత చూద్దాంలే.. అని చెప్పి.. న‌చ్చ‌జెప్పేవారు.

దీంతో స‌ద‌రు నాయ‌కుల్లో వైఎస్ ప‌ట్ల ఒక భ‌రోసా ఏర్ప‌డింది. అందుకే.. త‌ర్వాత 2009లో ఎన్నిక‌ల్లో ఎన్ని అడ్డంకులు వ‌చ్చినా.. అన్ని పార్టీలూ ఏకమై.. ఆయ‌న‌ను ఓడించాల‌ని ప్ర‌య‌త్నించినా.. వైఎస్ విజ‌యాన్ని ఏ ఒక్క‌రూ అడ్డుకోలేక పోయారు. ఇక‌, రాష్ట్రం విడిపోయిన త‌ర్వాత‌.. తెలంగాణ‌లో కేసీఆర్ ప్ర‌భుత్వం వ‌చ్చింది. అదేవిధంగా ఏపీలో తొలుత చంద్ర‌బాబు.. ఇప్పుడు జ‌గ‌న్ అధికారంలో ఉన్నారు. అయితే.. వీరు ఇద్ద‌రూ కూడా స‌చివాలయం వ‌ర‌కు రావ‌డం లేద‌నే టాక్ ఉంది. అంతేకాదు.. కొన్ని విభాగాల‌కు సంబంధించి.. అధికారుల స‌మీక్ష‌ల‌కు, స‌మావేశాల‌కు కూడా రావ‌డం లేదు.

అస‌లు ఎమ్మెల్యేల‌తో స‌ఖ్య‌త‌తో మెలుగుతున్న ప‌రిస్థితి ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఇది తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు తీవ్ర ఇబ్బందిక‌రంగా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో.. రెండు చోట్ల ఆయ‌న పార్టీ ప‌రాజ‌యం పాలైంది. ఇదే త‌ర‌హాలో ఇప్పుడు ఏపీలోనూ అధికార పార్టీపై వ్య‌తిరేక‌త పెరుగుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. స‌చివాల‌యానికి రాకుండా, అధికారుల‌తోను.. ఎమ్మెల్యేల‌తోనూ స‌ఖ్య‌త లేకుండా మెలుగుతున్నందున‌.. కేసీఆర్‌ను కాపీ కొడుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. దీంతో ఏపీ సీఎంకు కూడా గ‌డ్డు ప‌రిస్థితి వ‌స్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

సో.. ఈ ప‌రిణామాల‌ను గుర్తించి.. ఇప్ప‌టికైనా.. ఏపీ సీఎం త‌న పంథాను మార్చుకోవాల‌ని సూచిస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు చేరువ గా ఉండేందుకు.. ముఖ్యంగా ఎమ్మెల్యేల‌కు అండ‌గా ఉంటూ.. వారికి నియోజ‌క‌వ‌ర్గ నిధులు ఇస్తూ.. రెగ్యుల‌ర్‌గా ట‌చ్‌లో ఉంటే.. బాగుంటుంద‌ని.. సూచిస్తున్నారు. ప‌ది కాలాల పాటు ప్ర‌భుత్వం ఉండాల‌ని భావిస్తున్న జ‌గ‌న్‌కు ఈ స‌మ‌స్య ఇబ్బంది క‌రంగా మార‌కుండా.. చూసుకోవాల‌ని విశ్లేష‌కులు సూచిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ప‌రిస్థితిని చూసుకుంటే.. ``మా నాయ‌కుడు మాకే అప్పాయింట్‌మెంట్ ఇవ్వ‌డం లేదు. మా స‌మ‌స్య‌లే విన‌డం లేదు`` అనే ప‌రిస్థితి ఉంది. క‌నీసం.. వ‌చ్చే రెండున్న‌రేళ్ల స‌మ‌యంలో అయినా.. మార్పు చూపించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెబుతున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.