Begin typing your search above and press return to search.
మేరా భారత్ మహాన్.. న్యూజిలాండ్ మంత్రయినా మలయాళంలో ప్రసంగించిన భారతసంతతి యువతి
By: Tupaki Desk | 6 Nov 2020 6:40 PM ISTభారత సంతతికి చెందిన ఓ యువతి న్యూజిలాండ్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. న్యూజిలాండ్ పార్లమెంట్‌లో మలయాళంలో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. న్యూజిలాండ్ ప్రధానిగా జెసిండా ఆర్డెర్న్ రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆమె మంత్రివర్గంలో భారత సంతతికి చెందిన యువతి చోటు సంపాదించుకున్నారు. న్యూజిలాండ్‌లో భారత సంతతి మహిళ మంత్రి కావడం ఇదే తొలిసారి. అక్టోబర్ 17న జరిగిన న్యూజిలాండ్ ఎన్నికల్లో ప్రధాని జెసిండా ఆర్డెర్న్ నేతృత్వంలోని లేబర్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. గతంలో వివిధ పార్టీలతో కూడి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి జెసిండా.. ప్రస్తుతం ఒంటరిగానే అధికారం చేపట్టారు. ఇక, న్యూజిలాండ్ క్యాబినెట్ లో తొలిసారి ఓ భారత సంతతి వ్యక్తికి అవకాశం లభించింది. ప్రియాంక రాధా కృష్ణన్ న్యూజిలాండ్ మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు.
డైవర్సిటీ, ఇన్‌క్లూజన్, ఎథినిక్ కమ్యూనిటీ శాఖ మంత్రిగా, సామాజిక అభివృద్ధి, ఉద్యోగ కల్పన సహాయ మంత్రిగా బాధ్యతలను ప్రియాంకకు అప్పగించారు. ప్రియాంక పూర్వికుల స్వస్థలం కేరళకు రాష్ట్రంలోని ఎర్నాకులం. ప్రియాంక తండ్రి ఆర్ రాధాకృష్ణన్ న్యూజిలాండ్‌లో స్థిరపడ్డారు. సింగపూర్ లో చదువుకున్న ప్రియాంక. ఆ తర్వాత న్యూజిలాండ్‌లో ఉద్యోగం చేశారు. ఆమె మహిళలు, వలసకార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎన్నోపోరాటాలు చేశారు. అనంతరం 2006లో లేబర్‌పార్టీలో చేరారు.
2017 ఎన్నికల్లో పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ప్రస్తుతం మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె మలయాళం లో ప్రసంగించిన వీడియో ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘భారత సంతతికి చెందిన న్యూజిలాండ్ మంత్రి ప్రియాంక ఆ దేశ పార్లమెంట్‌లో మలయాళం లో ప్రసగించడం గొప్పవిషయం. దీన్ని ప్రతి భారతీయుడు ప్రశంసించాలి’ అని ట్వీట్ చేశారు.