Begin typing your search above and press return to search.
మెదక్ నుంచి ప్రియాంక గాంధీ పోటీ?
By: Tupaki Desk | 22 Jan 2023 11:54 AM ISTతెలంగాణలో కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి రాష్ట్ర నాయకులు కొత్త వ్యూహాన్ని పన్నుతున్నారు. గాంధీ కుటుంబానికి చెందిన వారిలో ఒకరిని ఇక్కడ పోటీ చేయించాలని అనుకుంటున్నారు. ఇందుకు ప్రియాంక గాంధీనే సరైన వ్యక్తిగా భావిస్తున్నారు. గతంలో ఇందిరాగాంధీ మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. అంతేకాకుండా మెదక్ లో ఆమె చేపట్టిన అభివృద్ధి పనులు ఇప్పటికీ ఆమెను గుర్తు చేస్తున్నారు. ప్రియాంక గాంధీ ఆమె రూపంతో ఉండడంతో కలిసొస్తుందని భావించి ఆమెను మెదక్ నుంచి పోటీ చేయించాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా టీపీసీసీ నాయకులు ఏఐసీసీకి ప్రతిపాదనలు పంపారు.
2014 నుంచి తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి అంత బాగోలేదు. అంతకుముందు వరుగా పదేళ్లు అధికారంలో ఉన్న ఆ పార్టీ తెలంగాణ ఉద్యమంతో కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చింది. ఇటీవల పార్టీలోని కుమ్ములాటల ద్వారా పార్టీకి మరింత బ్యాడ్ నేమ్ వేస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ను గాడిలో పడేసేందుకు టీపీసీసీ నాయకులు వివిధ రకాల ప్లాన్లు వేస్తున్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్ కీలకంగా మార్చే దిశగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రాహుల్ నిర్వహిస్తున్న జోడో యాత్రను తెలంగాణలోకి తీసుకురాగలిగారు. అయితే ఈ యాత్ర అంత ప్రభావం చూపలేకపోయింది. దీంతో ఇప్పుడు ప్రియాంక గాంధీని మెదక్ నుంచి పోటీ చేయిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి మారే అవకాశం ఉందని అంటున్నారు.
1980లో మెదక్ పార్లమెంట్ నుంచి ఇందిరాగాంధీ పోటీ చేసి 2 లక్షల మెజారిటీతో గెలిచారు. ఆ సమయంలో ఉత్తరాధిలో కాంగ్రెస్ హవా కొనసాగుతుండడంతో దక్షిణాదిన ఇందిరతో పోటీ చేయాలని నిర్ణయించారు. అయితే ఇందిరాగాంధీ మెదక్ లో కొన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 1984 జూలై 19న మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సర్పంచుల సదస్సుకు హాజరై అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేయించినట్లు కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. అలాగే సంగారెడ్డిలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆమె పాల్గొన్నారు. మెదక్ మున్సిపల్ కాంప్లెక్స్ తదితర అభివృద్ధి పనులు చేయించారు.
ఈ కారణంగా మెదక్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పట్టు కొనసాగిస్తూ వస్తోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధారణంగా కాంగ్రెస్ కు ఓటు బ్యాంకు వచ్చే పరిస్థితి లేదు. కానీ ప్రియాంక గాంధీతో పోటీ చేయిస్తే లాభం ఉంటుందని టీపీసీసీ నాయకులు భావిస్తున్నారు. అంతేకాకుండా ప్రియాంక గాంధీ అచ్చం ఇందిరా ఫేస్ కలిగి ఉండడంతో ప్రజలు ఆమెను ఆదరిస్తారని అనుకుంటున్నారు. ప్రస్తుతానికి బీఆర్ఎస్, బీజేపీ మధ్యే టఫ్ పైట్ సాగుతోంది. అయితే ప్రియాంక గాంధీని మెదక్ నుంచి పోటీ చేయంచడంతో పాటు ఇక్కడ ప్రచారానికి ఆహ్వానిస్తే కాంగ్రెస్ కు మంచిరోజులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ మేరకు టీపీసీసీ నాయకులు ఏఐసీసీ కి ప్రతిపాదనలు పంపారు. అయితే ఏఐసీసీ పరిశీలించిన తరువాత వారి ప్రతిపాదనకు ఓకే చెబుతారా..? లేదా..? అనేది ఉత్కంఠగా మారింది. అయితే ప్రియాంక గాంధీ పోటీ చేస్తే అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందని భావించి, ఎక్కువ శాతం నాయకులు ఈ ప్రతిపాదనకు సపోర్టు చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడున్న అసంతృప్తిని కూడా ఆమె చల్లార్చే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ ప్రతిపాదనకు ప్రియాంక గాంధీ ఎలా స్పందిస్తారో చూడాలి.